బిగ్ బాస్ 9 ఈసారి హోస్ట్ చాలా కాస్ట్ లీ..!
ఎనిమిది సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలో 9వ సీజన్ కి రెడీ అవుతుంది.
By: Tupaki Desk | 22 May 2025 7:00 PM ISTఎనిమిది సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలో 9వ సీజన్ కి రెడీ అవుతుంది. ఈ సీజన్ ని మరింత స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేయాలని చూస్తున్నారు బిగ్ బాస్ టీం. ముఖ్యంగా టాస్క్ లు, కంటెస్టెంట్స్ విషయంలో చాలా పెద్ద స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు హోస్ట్ గా కూడా నాగార్జుననే ఫైనల్ చేస్తున్నారట. బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్ మొదట్లో హోస్ట్ గురించి ప్రత్యేక చర్చ జరుగుతుంది. నాగార్జున సీజన్ 3 నుంచి హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. ఐతే సీజన్ 8 తర్వాత నాగార్జున మీద ఆ సీజన్ కంటెస్టెంట్స్ కామెంట్స్ చేశారు.
నాగార్జున ఆ కామెంట్స్ ని లైట్ తీసుకుంటారు కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం వాళ్లని ఎటాక్ చేస్తున్నారు. ఐతే బిగ్ బాస్ అంటేనే గొడవలు, వివాదాలు అయితే అన్ని భాషల్లో అది కంటెస్టెంట్స్ మధ్య మాత్రమే ఉంటాయి కానీ మన తెలుగులో మాత్రం కంటెస్టెంట్స్ తమ పరిధి దాటి హోస్ట్ ని కూడా తప్పు పడుతుంటారు. ఐతే ఎన్ని జరిగినా కూడా హోస్ట్ నాగార్జున మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తారు.
బిగ్ బాస్ సీజన్ 9 విషయంలో నాగార్జున మీద కూడా కామెంట్స్ రాకుండా చేయాలని టీం ప్లాన్ చేస్తుందట. ఐతే ఈ సీజన్ విషయంలో నాగార్జున కూడా పూర్తి ఫోకస్ గా ఉండబోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారట. ఇదివరకు కన్నా నాగార్జున ఈ సీజన్ కి రెట్టింపు రెమ్యునరేషన్ అడుగుతున్నారని తెలుస్తుంది.
బిగ్ బాస్ తెలుగు అంటే హోస్ట్ గా నాగార్జున పర్మినెంట్ అనేలా ఆడియన్స్ మైండ్ సెట్ ఫిక్స్ అయ్యింది. ఓ పక్క సినిమాలు ఇటు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున తన బ్రాండ్ ని కొనసాగిస్తున్నారు. ఐతే బిగ్ బాస్ వల్ల ఇయర్ లో సెకండ్ హాఫ్ మొత్తం కేటాయించాల్సి వస్తుంది. షూటింగ్ కి ఎక్కడికైనా వెళ్లినా కూడా వీకెండ్ కల్లా బిగ్ బాస్ కి టైం ఇవ్వాల్సి వస్తుంది. దీని వల్ల సినిమాలు కాస్త లేట్ అవుతున్నాయన్న ఆలోచన ఉన్నా అందులో సంపాదించాల్సిన మొత్తాన్ని బిగ్ బాస్ రెమ్యునరేషన్ ద్వారా అందుకుంటున్నాడు నాగార్జున.
బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటారన్న టాక్ ఉంది. అఫీషియల్ గా తెలియకపోయినా నాగార్జున రేంజ్ కి బిగ్ బాస్ షోకి ఉన్న పాపులారిటీకి ఇది కరెక్టే అనిపించక తప్పదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆగష్టు లేదా సెప్టెంబర్ లో మొదలు పెట్టాలని చూస్తున్నారు బిగ్ బాస్ టీం.
