బిగ్‌బాస్ 9 : మళ్లీ ఆ విమర్శలు తప్పవా?
తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్‌లు పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.
By: Tupaki Desk | 17 Jun 2025 4:19 PM ISTతెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్‌లు పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. అంటే ఇప్పటి వరకు మొత్తం 9 తెలుగు బిగ్ బాస్ సీజన్‌లు పూర్తి అయ్యాయి. మొత్తం 9 సీజన్‌లలో ఏడు సీజన్‌లకు నాగార్జున హోస్టింగ్ చేశాడు. మొదటి రెండు సీజన్‌లలో మొదటి సీజన్‌కి ఎన్టీఆర్, రెండో సీజన్‌కి నాని హోస్టింగ్ చేశాడు. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9కి హోస్టింగ్ చేయబోతున్నది ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే నాగార్జున కాకుండా మరెవ్వరూ బిగ్‌బాస్‌కు న్యాయం చేయలేని, ఆయన్నే కొత్త సీజన్‌కి కూడా హోస్టింగ్ చేస్తాడని షో నిర్వాహకులు అనధికారికంగా ప్రకటించారు. త్వరలోనే టీజర్ షూటింగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
బిగ్ బాస్ హోస్ట్ విషయంలో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం సీజన్ కోసం కంటెస్టెంట్స్ కోసం ఎంపిక జరుగుతోంది. వందల మంది పేర్లు పరిశీలించిన షో నిర్వాహకులు ఇప్పటికే దాదాపుగా పాతిక మందిని షార్ట్ లిస్ట్ చేశారు. అందులో కొందరిని తొలగించి త్వరలోనే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత సీజన్‌లో కన్నడ భాషకు చెందిన సెలబ్రిటీల డామినేషన్ ఎక్కువ అయింది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత సీజన్‌లో నిఖిల్, యష్మి గౌడ, ప్రేరణ, పృథ్వీరాజ్ శెట్టిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారు ఒక గ్రూప్‌గా క్రియేట్ అయ్యి తెలుగు కంటెస్టెంట్స్ ను తక్కువ చేసి మాట్లాడటం, తక్కువగా చూడటం చేశారు అంటూ బయట ఉన్న వారు చాలా మంది తీవ్రంగా విమర్శించారు.
తెలుగు వారు లేక పోవడం వల్ల కన్నడ వారిని తీసుకు వచ్చారా అంటూ ఆ సమయంలో బిగ్ బాస్ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు కొత్త సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక విషయం చూస్తే మళ్లీ ఆ విమర్శలు తప్పేలా లేవు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్త సీజన్‌లో కనీసం ముగ్గురు లేదా నలుగురు కన్నడ కంటెస్టెంట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కన్నడ బుల్లి తెర ఇండస్ట్రీకి చెందిన వారు తెలుగు బుల్లి తెరపై కనిపిస్తూ ఉంటారు. కనుక ఈసారి కూడా కన్నడ బుల్లి తెరకు చెందిన వారు, కన్నడ సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని విమర్శలు వస్తే అంతగా రేటింగ్ వస్తుందనే ఉద్దేశంతో షో నిర్వాహకులు అదే పనిని చేసే అవకాశాలు ఉన్నాయి.
బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ అంటూ కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ పేర్ల విషయానికి వస్తే... అలేఖ్య చిట్టీ పికిల్స్‌కి చెందిన రమ్య మోక్ష, రీతూ చౌదరి, కుమారి ఆంటీ, దేబ్‌జనీ, కుమారి ఆంటీతో పాటు స్టార్ మా లో ప్రసారం అయ్యే కొన్ని టీవీ సీరియల్స్‌లో నటించిన నటీ నటులు, సోషల్ మీడియాలో సందడి చేసేవారు, ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్, ఇద్దరు సింగర్స్, ఒక డాన్సర్... ఇలా కూర్పు జరిగిందని తెలుస్తోంది. త్వరలోనే కంటెస్టెంట్స్ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో షో ప్రారంభం కాబోతుందట. కుబేర సినిమా ప్రమోషన్ పూర్తి అయిన తర్వాత బిగ్ బాస్ 9 ప్రోమో షూట్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది.