బిగ్ బాస్‌ని ఈ సారి మరింత హీటెక్కించేస్తారట
త్వరలో సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. ప్రతి సీజన్‌కు ఎదో ఒక కాంట్రవర్సీ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్‌ని మాత్రం నిత్యం వార్తల్లో నిలవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 25 Jun 2025 10:00 PM ISTగత కొంత కాలంగా తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్‌బాస్. మిగతా భాషలతో పోలిస్తే తెలుగులో సూపర్ హిట్ అనిపించుకుంటున్న ఈ షో ఇప్పటి వరకు ఎనిమిది సీజన్‌లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. త్వరలో సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. ప్రతి సీజన్‌కు ఎదో ఒక కాంట్రవర్సీ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్‌ని మాత్రం నిత్యం వార్తల్లో నిలవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా దీని కోసం ఈ సీజన్‌ని హాట్ స్టాఫ్, హాటెస్ట్ కంటెస్టెంట్‌లతో నింపేస్తున్నారట.
గత కొంత కాలంగా ప్రతీ సీజన్‌ని సెప్టెంబర్‌లోనే ప్రారంభిస్తున్న నిర్వాహకులు ఈ సారి కూడా అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. తాజా సీజన్‌ని సెప్టెంబర్ 7 నుంచి లాంఛనంగా భారీ స్థాయిలో ప్రారంభించాలని ఇప్పటికే ఏర్పాట్లు మొదలు పెట్టినట్టుగా ఇన్ సైడ్ టాక్. గత కొన్ని సీజన్‌లకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున ఈ 9వ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. గతంలో పలువురి పేర్లు వినిపించినా నిర్వహకులు నాగ్ వైపే మొగ్గుచూపడంతో మరోసారి నాగ్ హోస్ట్‌గా స్టేజ్‌పైకి రాబోతున్నారు.
ఇక గత సీజన్‌లకు మించి ఈ సీజన్ కోసం హాట్ లేడీస్‌ని ఎక్కువగా హౌస్‌లోకి తీసుకురాబోతున్నారట. ఇప్పటికే లిస్ట్‌ని కూడా దాదాపుగా ఫైనల్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అమర్ దీప్ వైఫ్, టీవీ స్టార్, యూట్యూబర్ తేజస్విని గౌడ, ఇటీవల పబ్ లో గొడవతో వార్తల్లో నిలిచిన కల్పిక గణేష్, అలేఖ్య చిట్టి పికిల్స్‌తో నెట్టింట రచ్చ చేసిన అలేఖ్య చిట్టీ, జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్, నవ్యా స్వామి, సినిమాలకు దూరంగా ఉంటున్న సుమంత్ అశ్విన్, హాట్ లేడీస్ జ్యోతి రాయ్, రీతూ చౌదరిలతో పాటు సీరియల్ ఆర్టిస్ట్‌లు ముఖేష్ గౌడ, సాయి కిరణ్, శ్రావణి వర్మ, ఆర్జే రాజ్, డేబ్జాని మోడక్, దీపిక, సీతాకాంత్, హారిక, ఏక్‌నాథ్‌లని ఎంపిక చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కల్పిక గణేష్, అలేఖ్య చిట్టీ, హాట్ లేడీస్ జ్యోతి రాయ్, రీతూ చౌదరి, డేబ్జాని మోడక్‌లతో బిగ్‌బాస్ హౌస్‌లో హీటు పుట్టించాలనే ప్రయత్నాలు చేస్తున్నారట. వీరికి ఇమ్మాన్యుయేల్, సుమంత్ అశ్విన్, ముఖేష్ గౌడలని జత చేసి మరింతగా హౌస్‌లో రచ్చకు తెరలేపాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత సీజన్ వివాదాస్పదంగా మారి కంటెస్టెంట్‌లు జైలు వరకు వెళ్లడం.. ఫైనల్ ముగిసిన తరువాత అన్నపూర్ణ స్టూడియో బయట రోడ్డుపై అభిమానుల రచ్చ కారణంగా బిగ్‌బాస్ వివాదాస్పదం కావడం తెలిసిందే. నిర్వాహకుల ప్లాన్ చూస్తుంటే ఈ సారి కూడా బిగ్‌బాస్‌పై పెద్ద దుమారమే చెలరేగేలా కనిపిస్తోందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
