Begin typing your search above and press return to search.

ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. పెద్ద పెద్ద వాళ్లనే..!

ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగుతో పాటుగా బిగ్ బాస్ హిందీ కూడా నెక్స్ట్ మంత్ మొదలవుతుంది. బిగ్ బాస్ హిందీ సీజన్ 19 ఆగష్టు చివర్లో ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 July 2025 7:04 PM IST
ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. పెద్ద పెద్ద వాళ్లనే..!
X

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 బజ్ మొదలవుతుంది. సెప్టెంబర్ నుంచి మొదలవబోతున్న ఈ సీజన్ లో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తున్నారంటూ ఇప్పటికే కొందరు కొందరు లిస్ట్ రెడీ చేసి వైరల్ చేస్తున్నారు. బిగ్ బాస్ రేపు మొదలవుతుంది అనే నాటికి ఒక్కొక్కరు ఒక్కో లిస్ట్ ఫైనల్ అని హడావిడి చేస్తుంటారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈసారి రణరంగం గా ఉండబోతుందని ప్రోమోతోనే నాగార్జున చెప్పేశారు. సో ఈసారి కంటెస్టెంట్స్ మధ్య పెద్ద గొడవలే ఉండబోతున్నాయన్నమాట.

ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగుతో పాటుగా బిగ్ బాస్ హిందీ కూడా నెక్స్ట్ మంత్ మొదలవుతుంది. బిగ్ బాస్ హిందీ సీజన్ 19 ఆగష్టు చివర్లో ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ సీజన్ 19 హిందీ కంటెస్టెంట్స్ గా ఆలిషా పన్వర్, అరిఫ్షా ఖాన్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ అపొరొవ ముఖిజ, పురవ్ జా, బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్ర, యూట్యూబర్ గౌరవ్ తనేజా, కనిక మన్, మున్మున్ దత్తా, పరాస్ కల్నవత్, మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ, కృష్ణ ష్రాఫ్, ట్విన్స్ చింకీ మింకీ కూడా ఉంటారట.

వీరితోపాటు ఈసారి హిందీ బిగ్ బాస్ కి తెలుగులో యాక్టర్స్ గా పాపులర్ అయిన కొంతమంది కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. అందులో పోకిరి విలన్ ఆషిష్ విద్యార్ధి, తనుశ్రీ దత్తా, లతా సబర్వాల్, హీరోయిన్ అనిత కూడా కంటెస్టెంట్ గా వెళ్తున్నారట. వీళ్లందరితో పాటు రీసెంట్ గా మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న మమతా కులకర్ణి కూడా బిగ్ బాస్ 9 కి వెళ్తున్నట్టు టాక్. ఐతే షో మొదలైతే కానీ ఈ లిస్ట్ లో ఎవరు హౌస్ లోకి వెళ్తారన్నది తెలుస్తుంది.

ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో మాత్రం ఇప్పటికే జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, అలేఖ పికిల్స్ రమ్య, శివ కుమార్, ముఖేష్ గౌడ్, తీరూ చౌదరి, దెబ్జాని వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ టీం వీళ్లని సెలెక్ట్ చేశారని చెప్పుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో కూడా ఎవరు ఫైనల్ అన్నది షో మొదలయ్యాక తెలుస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 9 మొదలు పెడతారని టాక్.