బిగ్‌బాస్: ఎంగిలి గ్లాసులు కడిగి చూపించిన నాగార్జున
అయితే, ప్రతి సీజన్‌లోనూ ఒక కంటెస్టెంట్ మాత్రం మొదటి ఎపిసోడ్ నుంచి జనాలకి చిరాకు తెప్పిస్తాడు.
By: Tupaki Desk | 12 Sept 2026 11:03 PM ISTగత పదేళ్లుగా బిగ్‌బాస్ ప్రసారం అవుతోంది. ఓటీటీతో కలుపుకుంటే 11 సీజన్లు పూర్తయ్యాయి. అయితే, ప్రతి సీజన్‌లోనూ ఒక కంటెస్టెంట్ మాత్రం మొదటి ఎపిసోడ్ నుంచి జనాలకి చిరాకు తెప్పిస్తాడు. అలాంటి వాళ్లు టీవీ స్క్రీన్ మీద కనిపిస్తే జనాలు తిట్టుకోవడం మాత్రం ఆపరు. అయితే, ఈ సీజన్‌లో త్రిగుణ్ ఆ కోవకే చెందుతాడనిపిస్తోంది. అయితే అతను రోహిత్ తో గొడవ పడిన విధానం చూసినప్పుడు, జనాల్లో రోహిత్ కి సింపతీ పెరిగింది.
ఇకపోతే వీకెండ్ లో త్రిగుణ్ కి నాగార్జున గట్టి క్లాస్ పీకుతాడు అనుకుంటే, రోహిత్ కి క్లాస్ పీకే డోసు పెంచినట్టుగా తెలుస్తుంది. ఒకానొక సందర్భం లో గిన్నెలు కడిగే విషయం గురించి మాట్లాడుతూ, “ఎంగిలి గ్లాసులు నేను కడగలేను” అని చెప్పాడు రోహిత్. కాకపోతే అతను చెప్పిన సందర్భం వేరు. కానీ నాగార్జున మాత్రం రోహిత్ కి గట్టి క్లాసే పీకాడు.
రోహిత్ కి లెసన్ నేర్పించాలని ఉద్దేశ్యంతో కంటెస్టెంట్స్ తాగిన మిల్క్ షేక్ గ్లాసులు కడిగి, “నేను ఎంగిలి చేసిన గ్లాసులు కడగడం లో ఏ మాత్రం ఇబ్బంది పడను” అని చెప్పిన నాగార్జున, రోహిత్ ని నిలదీసాడు. ప్రోమో ప్రకారం రోహిత్ కి నాగార్జున ఎక్కువ ఎక్ష్ప్లైన్ చేసుకొనేందుకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు.
ఇంకో పక్కన త్రిగుణ్ కి కూడా క్లాస్ పీకాడు కానీ ఏ రేంజ్ లో ఉందనే విషయం మాత్రం మనకి ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది. సినిమాల్లో త్రిగుణ్ కి అంతంత మాత్రం గుర్తింపు వచ్చింది కానీ ఒక్కసారి బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే త్రిగుణ్ పేరు మారిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో త్రిగుణ్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే, ఇప్పటివరకు ఏ సీజన్‌లోనూ ఇంత బ్యాడ్ బిహేవియర్ ఉన్న కంటెస్టెంట్ రాలేదేమో అనిపిస్తోంది.
ఇంట్లో రోహిత్ గురించి చెడుగా మాట్లాడటం తప్ప వేరే పని లేకుండా అందరినీ విసిగిస్తున్నాడు త్రిగుణ్. అంతేకాదు, సృష్టి గురించి కూడా చాలా అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అరగంట ఫుటేజ్ చూస్తే త్రిగుణ్ మైండ్ ఎంత వంకరగా ఉందో అర్థమవుతుంది. ఈ వారం మొత్తం ఇంత చెత్తగా ప్రవర్తించిన త్రిగుణ్‌పై నాగార్జున ఏ రేంజ్‌లో ఫైర్ అవుతారో అని బిగ్‌బాస్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూడగా నాగార్జున మాత్రం రోహిత్ కి గట్టి క్లాస్ పీకినట్టు అనిపిస్తుంది.
