బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ షాక్ తప్పదా..!
బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారం నుంచి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది
By: Tupaki Desk | 26 July 2025 11:07 AM ISTబిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారం నుంచి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ తో పాటుగా ఇదివరకు సీజన్లలో కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా పంపించారు. బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి సీజన్ నుంచి 7వ సీజన్ దాకా వచ్చిన కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా తీసుకొచ్చారు. దాదాపు ఎనిమిది మంది దాకా లాస్ట్ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వచ్చారు.
ఐతే రాబోతున్న సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ విషయంలో షాక్ ఇవ్వనున్నారట. బిగ్ బాస్ సీజన్ 9 ని ఆడియన్స్ కి కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో వైల్డ్ కార్డ్స్ గా ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే తీసుకొస్తారట. సీజన్ 8 లో లాగా ఇదివరకు సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్స్ నే తీసుకొస్తారట. కాకపోతే ఒకరిద్దరు మాత్రమే వైల్డ్ కార్డ్స్ గా వస్తారని టాక్.
ఇక ఇప్పటికే ఈ సీజన్ లో వచ్చే కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సీజన్ రేపు మొదలవుతుంది అనుకునే వరకు కూడా రకరకాల పేర్లతో కంటెస్టెంట్స్ లిస్ట్ వస్తాయి. ఐతే వాటిలో ఏది ఫైనల్ లిస్ట్ అన్నది షో మొదలైనప్పుడే తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్స్ గా కామన్ మ్యాన్ ని కూడా తీసుకుంటారన్న టాక్ ఉంది. ఈ సీజన్ లో ఒకరిద్దరు కాదు ఏకంగా 9 మంది కంటెస్టెంట్స్ దాకా కామన్ మ్యాన్ హౌస్ లోకి వస్తారని టాక్.
సోషల్ మీడియా ట్రెండింగ్ తో పాటుగా వివాదాల్లో చిక్కుకున్న వారు కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా వస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 రణరంగంగా ఉండబోతుందని హింట్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. ఈ సీజన్ హోస్ట్ గా కూడా నాగార్జున ఇంకాస్త ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 విషయంలో కొత్త టాస్కులు, కొత్త సెగ్మెంట్స్ బిగ్ బాస్ లవర్స్ ని సూపర్ ఎంటర్టైన్ చేస్తాయని అంటున్నారు. మరి షో మొదలయ్యే టైం కి మరిన్ని డీటైల్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి.
