Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9లో ఆణిముత్యం..?

బిగ్ బాస్ సీజన్ 9ని ఈసారి త్వరగానే మొదలు పెట్టే ప్లానింగ్ లో ఉన్నారు బిగ్ బాస్ టీమ్. సీజన్ 8 ని పూర్తి చేసిన బిగ్ బాస్ టీమ్ సీజన్ 9ని ఇంకాస్త భారీగా సెట్ చేస్తున్నారట.

By:  Tupaki Desk   |   23 May 2025 11:23 AM IST
బిగ్ బాస్ 9లో ఆణిముత్యం..?
X

బిగ్ బాస్ సీజన్ 9ని ఈసారి త్వరగానే మొదలు పెట్టే ప్లానింగ్ లో ఉన్నారు బిగ్ బాస్ టీమ్. సీజన్ 8 ని పూర్తి చేసిన బిగ్ బాస్ టీమ్ సీజన్ 9ని ఇంకాస్త భారీగా సెట్ చేస్తున్నారట. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ నుంచి టాస్క్ ల దాకా అంతా కొత్తగా ఉండేలా చూస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టంట్స్ ఎవరన్నది ఇప్పటికే ఒక లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐతే ఫైనల్ లిస్ట్ ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

బిగ్ బాస్ షోలో కామన్ మ్యాన్ కేటగిరిలో ఒకరిని తీసుకుంటారు. బిగ్ బాస్ రివ్యూయర్స్ కి కూడా ఆ ఛాన్స్ ఇస్తుంటారు. ఐతే బిగ్ బాస్ రివ్యూస్ చెబుతూ ఇప్పటికే ఆది రెడ్డి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లాడు. బిగ్ బాస్ సీజన్ 7 లో ఆది రెడ్డి ఒక కంటెస్టెంట్ గా వెళ్లి టాప్ 5 దాకా ఉన్నాడు. బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా మరో రివ్యూయర్ ని తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో రివ్యూయర్ ఆణిముత్యం తో బిగ్ బాస్ టీమ్ చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 9 లో ఆణిముత్యం నిజంగానే ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. బిగ్ బాస్ రివ్యూయర్ గా ఆణిముత్యం కొన్నాళ్లుగా కొనసాగుతున్నారు. యూఎస్ లో ఉంటున్న ఆమె బిగ్ బాస్ రివ్యూస్ లో చాలా పాపులర్. ఆణిముత్యం ఆమె యూట్యూబ్ ఛానెల్ పేరు ఆమె అసలు పేరు శ్రీ సత్య. ఆణిముత్యం సినిమాల రివ్యూస్ కూడా ఇస్తారు కానీ బిగ్ బాస్ రివ్యూస్ తో ఆమె క్రేజ్ తెచ్చుకున్నారు. ఆమెకు యూట్యూబ్ లో 96,000 సబ్ స్కైబర్స్ ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో కూడా 1,06,000 దాకా ఫాలోవర్స్ ఉన్నారు.

బిగ్ బాస్ 9 లో ఆణిముత్యం కి ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది చూడాలి. బిగ్ బాస్ టీం ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో కూడా చాలా ప్లానింగ్ తో ఉన్నారని తెలుస్తుంది. ఒకవేళ బిగ్ బాస్ 9 లో నిజంగానే ఆణిముత్యం ఉంటే సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ రివ్యూయర్స్ లో పాపులర్ అయిన వారు చాలామంది ఉన్నారు. వారిలో ఆది రెడ్డి ఇప్పటికే బిగ్ బాస్ ఛాన్స్ అందుకోగా ఆ లిస్ట్ లో ఇప్పుడు ఆణిముత్యం కూడా ఉండబోతుందని తెలుస్తుంది.