బిగ్ బాస్ 9 లోకి ఆ జబర్దస్త్ కమెడియన్..?
జబర్దస్త్ లో తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఇమ్మాన్యుయెల్ పాపులారిటీ పెంచుకున్నాడు.
By: Tupaki Desk | 8 July 2025 8:30 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 ని రెడీ చేసే పనుల్లో టీం రెడీ అవుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 లో కామన్ మ్యాన్ కి కూడా ఛాన్స్ ఇచ్చేలా ప్రోమో వదిలారు. 3 నిమిషాల వీడియోతో బిగ్ బాస్ అంటే ఇష్టం ఉండి అందులోకి వెళ్లాలని ఉన్న ఎవరైనా ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. ఐతే ఎంపిక చేసే విధానంలోనే చాలామందిని వడకట్టి తమకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న వారిని ఫైనల్ చేసి హౌస్ లోకి పంపిస్తారు.
బిగ్ బాస్ సీజన్ 9 లో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ తో షో మొదలు పెట్టే ఆలోచనలో ఉన్న టీం కామన్ మ్యాన్ కేటగిరిలో ఈసారి ఒకరిద్దరు కాదు ఏకంగా 9 మందిని సెలెక్ట్ చేస్తారని టాక్. ఇక మరోపక్క 9 మంది సెలబ్రిటీస్ కూడా హౌస్ లోకి వస్తారని తెలుస్తుంది. సీజన్ 9 బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని కూడా ఇప్పటికే ఓకే చేశారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 9లో జబర్దస్త్ కమెడియన్ ఒకరు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రతి సీజన్ బిగ్ బాస్ లో జబర్దస్త్ కమెడియన్ ని ఒకరు కంపల్సరీ గా ఉంటారు. ఐతే అక్కడ నుంచి వస్తే మళ్లీ జబర్దస్త్ కి వెళ్లడం కుదరదని కొందరు చాన్స్ వచ్చినా రాలేదు. కానీ కొందరు మాత్రం జబర్దస్త్ ని వదిలి వచ్చారు.
ఇప్పటికే అవినాష్, చలాకి చంటి, ఫైమా, టేస్టీ తేజా ఇలా జబర్దస్త్ నుంచి వచ్చి బిగ్ బాస్ హౌస్ లో తమ కామెడీతో అలరించారు. ఇక ఇప్పుడు ఆ అవకాశాన్ని ఇమ్మాన్యుయెల్ అందుకుంటున్నాడని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో ఇమ్మాన్యుయెల్ ఎంట్రీ దాదాపు కన్ ఫర్మ్ అంటున్నారు.
జబర్దస్త్ లో తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఇమ్మాన్యుయెల్ పాపులారిటీ పెంచుకున్నాడు. ఇక బిగ్ బాస్ కి వెళ్లి తన కామెడీతో ఆడియన్స్ ని ఆకట్టుకుని చివరి వారం వరకు ఉండాలని చూస్తున్నాడు. ఇంతకీ నిజంగానే జబర్దస్త్ నుంచి ఇమ్మాన్యుయెల్ బిగ్ బాస్ కి వెళ్తున్నాడా.. అతను అక్కడ నుంచి ఇక్కడకు షిఫ్ట్ ఐతే మళ్లీ జబర్దస్త్ ఛాన్స్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.
