Begin typing your search above and press return to search.

తనూజకి సారీ చెప్పిన పూలు కూడా పెట్టుకోలేని మనిషి..!

బిగ్ బాస్ సీజన్ 9లో అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన మర్యాద మనీష్ ఈ సీజన్ లో ఒకసారి నామినేషన్స్ కోసం రీ ఎంట్రీ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   24 Dec 2025 10:16 AM IST
తనూజకి సారీ చెప్పిన పూలు కూడా పెట్టుకోలేని మనిషి..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన మర్యాద మనీష్ ఈ సీజన్ లో ఒకసారి నామినేషన్స్ కోసం రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ టైం లో తనూజని ముద్దు ముద్దు మాటలతో టైం పాస్ చేస్తున్నారు అంటూ ఎటాక్ చేశాడు. ఐతే ఆ మాటలకు తనూజ చాలా అప్సెట్ అయ్యింది. తను చేసిన ముద్ద మందారం సీరియల్ టైటిల్ తో ఆమెను టార్గెట్ చేయడం తనూజని హర్ట్ చేసింది. అంతేకాదు ఫ్యామిలీ వీక్ లో ఆమె కోసం వచ్చిన సీరియల్ యాక్టర్ హరిత కూడా ఈ ముద్ద మందారం టాపిక్ తెచ్చి కాస్త ఎమోషనల్ అయ్యింది.

మర్యాద మనీష్ మాటలు బాధపెట్టాయని..

ఐతే తనూజ బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో ఎవరి నుంచైనా సారీ ఎక్స్ పెక్ట్ చేస్తున్నావా అంటే తన గురించి ముద్దు మాటలంటూ మర్యాద మనీష్ మాటలు తనని కాస్త బాధపెట్టాయని అన్నది. ఐతే తనేమి అతని నుంచి సారీ ఎక్స్ పెక్ట్ చేయట్లేదని చెప్పింది. ఐతే ఎపిసోడ్ పూర్తయ్యాక తనూజకి తన సోషల్ మీడియా ద్వారా క్షమాపణ చెప్పాడు మర్యాద మనీష్. అతను ఏం చెప్పాడు అంటే హౌస్ లో ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ తను లో గా ఫీల్ అవుతున్న టైం లో కూడా ఆమె సపోర్ట్ చేసింది.

ఐతే హౌస్ లో రీ ఎంట్రీ టైంలో ఆమెను టార్గెట్ చేయాలని అనుకున్నా ఆ సందర్భంగానే అలా మాట్లాడాను. అదంతా ఆట వరకే. హౌస్ లో తనూజ చూపించిన తెగువ ఆమె ఆట ఎప్పటికీ గుర్తుంటుంది. తనూజ మాట్లాడిన టైంలోనే మైక్ తనకు వస్తే అక్కడే అపాలజీ చెప్పే వాడిని కానీ అలా జరగలేదు. తనని కావాలని అలా అనలేదని మర్యాద మనీష్ తన సోషల్ మీడియాలో పెట్టాడు. అంతేకాదు ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఐతే చివరగా ఆమెను ముద్దు ముద్దు మాటలు అన్నందుకు ఫైనల్ గా తన మీద తనే కనీసం పూలు కూడా పెట్టుకోలేని మనిషి అంటూ తన మీద తనే సెటైర్ వేసుకున్నాడు మనీష్.

ఆట కోసమే అన్నివిధాలుగా..

హౌస్ లో ఉన్నప్పుడు అందరు ఆట కోసమే అన్ని విధాలుగా ట్రై చేస్తారు. కొన్ని అవతల వారికి కాస్త ఇబ్బందిగా పర్సనల్ ఎటాక్ లా అనిపించొచ్చు. ఐతే బయటకు వచ్చాక ఇలా సార్ట్ అవుట్ చేసుకుంటే అందరికీ బాగుంటుంది. బిగ్ బాస్ హౌస్ లో తనూజ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు విన్నర్ మెటీరియల్ అనిపించుకున్న తనూజ ఆడియన్స్ నుంచి సూపర్ సపోర్ట్ అందుకుంది.

మరి మర్యాద మనీష్ పెట్టిన ఈ అపాలజీ మెసేజ్ కి తనూజ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. తనూజ ఫ్యాన్స్ మాత్రం మర్యాద మనీష్ చెప్పిన అపాలజీకి అతన్ని ప్రశంసిస్తున్నారు.