బిగ్ బాస్ 9.. 3 రోజుల్లోనే షాక్..!
కానీ బిగ్ బాస్ సీజన్ 9 కి మాత్రం షో మొదలవడానికి నెల రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో హంగామా మొదలైంది.
By: Tupaki Desk | 28 July 2025 11:21 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 మొదలవ్వకముందే ఈసారి బజ్ బాగుంది. ప్రతి సీజన్ మొదలైన తర్వాత షో గురించి అందరు మాట్లాడుకుంటారు. కానీ బిగ్ బాస్ సీజన్ 9 కి మాత్రం షో మొదలవడానికి నెల రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. అఫ్కోర్స్ బిగ్ బాస్ 9 కోసం అందులో కంటెస్టెంట్స్ లిస్ట్ కోసం రివ్యూయర్స్ చేస్తున్న హడావిడి తెలిసిందే. ఒక్కొక్కరు వాళ్లకి ఇష్టం వచ్చినట్టుగా కంటెస్టెంట్స్ లిస్ట్ వేస్తున్నారు.
ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరన్నది మాత్రం షో మొదలయ్యాక తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 లో బిగ్ బాస్ టీం ఈసారి ఆడియన్స్ కు షాకుల మీద షాకులు ఇస్తారట. షో మొదలైన 3 రోజుల్లోనే ఎలిమినేషన్ అంటూ షాక్ ఇస్తారట. షోని మరింత రసవత్తరంగా మార్చేందుకు మొదటి 3 రోజుల నుంచే బిగ్ బాస్ ఆట మొదలు పెడతాడట. బిగ్ బాస్ ఎలిమినేషన్ ఎప్పుడైనా వారం తర్వాత ఉంటుంది.
మొదటి ఎలిమినేషన్ హౌజ్ లో వెళ్లిన వాళ్ల జస్ట్ రెండు రోజుల బిహేవియర్ చూసి హౌస్ లో వాళ్లు అన్ ఫిట్ అని నామినేట్ చేస్తారు. అలా నామినేట్ అయిన వారి నుంచి బయట బిగ్ బాస్ లవర్స్ ఎవరిని సేఫ్ చేయాలి.. ఎవరిని ఎలిమినేట్ చేయాలన్నది చూస్తారు. కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 లో ఫస్ట్ త్రీ డేస్ లోనే ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 9 విషయంలో టీం అంతా చాలా కష్టపడి కొత్త కొత్త టాస్క్ లు ప్రవేశ పెడుతున్నారట. సీజన్ 9 అంతకుముందు సీజన్లు అన్నిటి కన్నా ది బెస్ట్ అనిపించేలా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 కి కింగ్ నాగార్జున హోస్టింగ్ కూడా అదిరిపోయేలా ఉంది. మరి సీజన్ 9 నిజంగానే మొదటి ఎలిమినేషన్ మూడు రోజుల్లో ఉంటుందా అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 9 ని సెప్టెంబర్ మొదటి వారంలో మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు బిగ్ బాస్ టీం.
బిగ్ బాస్ సీజన్ 9 రణరంగం అంటూ కొత్త ప్రోమోతో నాగార్జున సర్ ప్రైజ్ చేశారు. షో మొదలు పెట్టకముందే ఈసారి ఆడియన్స్ లో క్యూరియాసిటీ కూడా మొదలైంది.
