Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : బయటకు వచ్చినా అభయ్ అదే మాట..!

బిగ్ బాస్ లో కాకపోయినా తన యూట్యూబ్ ద్వారా, ఇన్ స్టాగ్రాం ఇంకా సినిమాల ద్వారా అందరితో టచ్ లో ఉంటానని అన్నాడు అభయ్ నవీన్.

By:  Tupaki Desk   |   23 Sept 2024 5:37 PM IST
బిగ్ బాస్ 8 : బయటకు వచ్చినా అభయ్ అదే మాట..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో 3వ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ మీద అతను చేసిన వ్యాఖ్యల వల్ల హోస్ట్ నాగార్జున శనివారమే అభయ్ కు రెడ్ కార్డ్ చూపించి హౌస్ నుంచి బయటకు వెళ్లమని చెప్పగా హౌస్ మెట్స్ రిక్వెస్ట్ వల్ల నాగార్జున ఆ మాట వెనక్కి తీసుకున్నాడు. ఐతే ఆదివారం నామినేషన్స్ లో ఉన్న అభయ్ లీస్ట్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయినట్టు వెల్లడించారు.

బయటకు వచ్చిన అభయ్ తనకు బయట ఉన్న ఫాలోయింగ్ చూసి సంతోషించాడు. తన వెనక ఇంతమంది ఉన్నందుకు తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. అంతేకాదు తను ఎక్కడైనా దిల్ దార్ గా ఉంటానని బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడే మనిషి కాదని అన్నాడు. నా కోసం ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు. ఐతే ఇంకొన్ని రోజులు హౌస్ లో ఉండాల్సింది కానీ బయటకు రావాల్సి వచ్చిందని అన్నాడు అభయ్.

బిగ్ బాస్ లో కాకపోయినా తన యూట్యూబ్ ద్వారా, ఇన్ స్టాగ్రాం ఇంకా సినిమాల ద్వారా అందరితో టచ్ లో ఉంటానని అన్నాడు అభయ్ నవీన్. ఎలిమినేట్ అయ్యాక చేసిన ఇంటర్వ్యూస్ లో కూడా బిగ్ బాస్ మీద తను చేసిన కామెంట్స్ పై ఏమాత్రం వెనక్కి తగ్గలేదు అభయ్ నవీన్. అదంతా తను కావాలనే చేశానని అది కామెడీగా అన్నానే తప్ప మరో ఉద్దేశం లేదని అన్నాడు.

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో కూడా కొన్నిసార్లు కొన్ని వర్క్ అవుట్ అవుతాయి కొన్ని వర్క్ అవుట్ కావు ఇది కూడా అలానే ఇంకొన్నాళ్లు హౌస్ లో ఉండాల్సింది కానీ కుదరలేదు. మీ అందరినీ మరో విధంగా అలరిస్తానని అన్నాడు అభయ్ నవీన్. ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన అభయ్ ను శేఖర్ బాషా, బేబక్క కలిశారు. హౌస్ లో స్ట్రాంగ్ అనుకున్న అభయ్ నవీన్ ఇంత త్వరగా ఎలిమినేట్ అవ్వడం బిగ్ బాస్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. ఆదివారం ఎపిసోడ్ హౌస్ మెట్స్ కి కూడా కొంత ఎమోషనల్ అనిపించగా నేటి ఎపిసోడ్ లో నామినేషన్స్ తో మళ్లీ హౌస్ అంతా వేడి కానుందని చెప్పొచ్చు.