Begin typing your search above and press return to search.

బలగం వేణుపై పెద్ద బారమే..

ఈ సినిమాకి సంబందించిన రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   25 Feb 2024 3:49 AM GMT
బలగం వేణుపై పెద్ద బారమే..
X

బలగం సినిమాతో దర్శకుడిగా కమెడియన్ వేణు ప్రయాణం మొదలుపెట్టాడు. మూడు కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఏకంగా 26 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దిల్ రాజు సెకండ్ బ్యానర్ లో మొదటి సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు వేణుకి దిల్ రాజు మరో ఆఫర్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే ధృవీకరించారు. ఈ సినిమాకి సంబందించిన రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

నేచురల్ స్టార్ నానితో వేణు నెక్స్ట్ మూవీ ఉండబోతోందని చాలా కాలం నుంచి ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పి ఒకే చేయించుకున్నారంట. ప్రస్తుతం ఈ మూవీ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో వేణు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఎల్లమ్మ అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. పీరియాడికల్ జోనర్ లో కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది.

1980 బ్యాక్ డ్రాప్ లో గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో ఈ కథ ఉంటుందంట. సినిమాలో బలమైన ఎమోషన్స్ తో పాటు యాక్షన్ అంశాలు కూడా ఉంటాయంట. ఫ్యామిలీ అండ్ లవ్ ఎలిమెంట్స్ కూడా కథలో భాగంగా ఉంటాయని తెలుస్తోంది. పీరియాడికల్ జోనర్ కావడంతో మూవీకి 40 నుంచి 50 కోట్ల మధ్యలో బడ్జెట్ అవుతుందంట.

నేచురల్ స్టార్ నాని మార్కెట్ దసరా సినిమా తర్వాత పెరిగిన కూడా ఇంకా 50 కోట్ల బిజినెస్ అయితే అతని మీద జరగడం లేదు. దానికి తోడు 3 కోట్లతో మొదటి సినిమా చేసి ఇప్పుడు ఏకంగా 50 కోట్ల బడ్జెట్ ప్రాజెక్ట్ అంటే కచ్చితంగా వేణు మీద పెద్ద భారమే అవుతుంది. దీనిని అతను ఎలా హ్యాండిల్ చేయగలడు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

అయితే వేణు వెనుక దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ఉన్నారు. బడ్జెట్ ఎంత అయిన దానిని మార్కెట్ చేసుకునే సామర్ధ్యం దిల్ రాజు సొంతం. దిల్ రాజు కథని బాగా నమ్మితే భారీ బడ్జెట్ పెట్టడానికి వెనుకాడరు. ఇప్పుడు వేణు సిద్ధం చేసిన ఎల్లమ్మ స్టోరీ మీద నమ్మకంతోనే దిల్ రాజు ఆ స్థాయిలో బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారంట.