Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : ఆమె అవ్వాల్సింది అతను ఎలిమినేట్ అయ్యాడా..?

బిగ్ బాస్ సీజన్ 7 లో ఆదివారం టేస్టీ తేజ ఎలిమినేషన్ జరిగింది. లాస్ట్ వీక్ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా ఈ వారం తేజాని ఇంటి నుంచి బయటకు పంపించేశారు

By:  Tupaki Desk   |   6 Nov 2023 4:37 AM GMT
బిగ్ బాస్ 7 : ఆమె అవ్వాల్సింది అతను ఎలిమినేట్ అయ్యాడా..?
X

బిగ్ బాస్ సీజన్ 7 లో ఆదివారం టేస్టీ తేజ ఎలిమినేషన్ జరిగింది. లాస్ట్ వీక్ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా ఈ వారం తేజాని ఇంటి నుంచి బయటకు పంపించేశారు. తేజ మొదట్లో ప్రతి వారం నామినేషన్స్ లో వచ్చి హౌస్ నుంచి వెళ్లిపోతాడేమో అనుకున్నాడు కానీ చిన్నగా స్ట్రాంగ్ అవుతూ వచ్చాడు. శోభా శెట్టితో అతని ఫ్రెండ్ షిప్ అతనికి కొంత మైలేజ్ ఇచ్చింది. శోభాని ప్రేమిస్తున్నా అంటూ వెంటపడి తేజ కొంత కంటెంట్ ఇచ్చాడు. అయితే తేజ ఎలిమినేషన్ పై బిగ్ బాస్ ఆడియన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అదెలా అంటే తేజాతో పోల్చుకుంటే శోభా శెట్టికే తక్కువ ఓట్లు వచ్చాయని కానీ ఆమె కెప్టెన్ అయిన కారణంగా ఆమెను సేవ్ చేసి తేజాని ఎలిమినేట్ చేశారని అంటున్నారు.

బిగ్ బాస్ ఓటింగ్ అఫీషియల్ పోల్స్ ఆధారంగానే ఎలిమినేషన్ జరుగుతుంది. ఒక్కోసారి బిగ్ బాస్ టీం కొంతమంది కంటెస్టెంట్స్ ని కావాలని ఎలిమినేట్ చేయకుండా ఉంచుతారని అంటున్నారు. శోభా శెట్టిని పంపించడం ఇష్టం లేకనే తేజాని పంపించారని చెప్పుకుంటున్నారు. శోభా హౌస్ లో అంతా తనకే తెలుసు అన్నట్టుగా ఏదైనా టాస్క్ లో తనకు అన్యాయం జరిగితే అవతల ఉన్నది ఎవరైనా సరే వారితో పెద్ద వాదన పెట్టుకుంటుంది. ఇవన్నీ బిగ్ బాస్ కి కంటెంట్ ఇచ్చేందుకు అవసరం కాబట్టే శోభా శెట్టిని ఉంచి తేజాని హౌస్ నుంచి బయటకు పంపించారని అంటున్నారు.

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో భాగంగా 9వ వారం తేజ ఎలిమినేట్ అయ్యాడు. చివరి వరకు తేజాతో పాటు రతిక కూడా వచ్చింది. ఆమె తనను మళ్లీ ఆడియన్స్ ఎలిమినేట్ చేశారేమో అని ఎమోషనల్ అయ్యింది. కానీ రతిక సేఫ్ అయ్యి తేజా బయటకు వచ్చాడు. రతిక ఇక మీదట తన ఆట తీరు మార్చుకోకపోతే మాత్రం ఆమె ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఇక రానున్న వారాలన్నీ కూడా చాలా టఫ్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది.

ఇక మీదట నామినేషన్స్ కూడా కామెడీ చేయకూడదు. హౌస్ లో ఉండేందుకు ఎవరు అనర్హులో వాళ్లనే నామినేట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ వీక్ నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారన్నది ఈరోజు ఎపిసోడ్ అయ్యాక తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 6 కన్నా సీజన్ 7 చాలా బెటర్ గా రన్ అవుతుంది. ఆడియన్స్ అంతా కూడా ఈ సీజన్ ని ఎంజాయ్ చేస్తున్నారు.