Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : కంటెంట్ కోసమే ఈ తిప్పలంతా.. ఎవరి ఆట ఎవరు చెడగొడుతున్నారు..?

రతిక రీ ఎంట్రీ తర్వాత హౌస్ లో మంటలు చెలరేగాయి. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన రతిక ఈ ఉల్టా పుల్టా ఆటలో భాగంగా మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు.

By:  Tupaki Desk   |   1 Nov 2023 8:18 AM GMT
బిగ్ బాస్ 7 : కంటెంట్ కోసమే ఈ తిప్పలంతా.. ఎవరి ఆట ఎవరు చెడగొడుతున్నారు..?
X

బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెంట్ కోసం హౌస్ మెట్స్ తిప్పలు అన్నీ ఇన్ని కావన్నట్టుగా ఉంది. కొందరు తమ ఆట తీరుతో కంటెంట్ ఇస్తుంటే కొందరు హౌస్ మెట్స్ మాత్రం కావాలని కంటెంట్ కోసమే అన్నట్టుగా అతి చేస్తున్నారు. బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా లో భాగంగా ఎప్పుడు ఏ టాస్క్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. అందుకే హౌస్ మెట్స్ అంతా రెడీగా ఉండాల్సి వస్తుంది. అఫ్కోర్స్ అన్ని సీజన్లలో ఇదే జరిగినా ఈ సీజన్ ఉల్టా పుల్టా కాబట్టి కాస్త స్పెషల్ ఆ ఉంటుంది.

రతిక రీ ఎంట్రీ తర్వాత హౌస్ లో మంటలు చెలరేగాయి. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన రతిక ఈ ఉల్టా పుల్టా ఆటలో భాగంగా మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు. అయితే ఆమె రీ ఎంట్రీ వల్ల కొందరి ఆట డిస్టర్బ్ అవుతుంది. ముఖ్యంగా యావర్ ఆటని ఆమె తినేస్తుంది. రతిక ఎంట్రీ తర్వాత అతను ఆమె చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకున్నాడు. యావర్ ని హోస్ట్ నాగార్జున కూడా ఈ విషయంలో హింట్ ఇచ్చారు. యావర్ ఈ వారం అది తెలుసుకుని ఆట ఆడితే బెటర్ లేదంటే కష్టమే.

ఇక మరోపక్క శోభ శెట్టి, తేజల జోడీ కూడా ఆడియన్స్ కి ఫన్ ఇస్తున్నాం అనుకుంటున్నారు కానీ అది శిక్షగా ఉంది. నిన్న బిగ్ బాస్ హౌస్ లో లేడీస్ అందరికీ జెంట్స్ హెల్ప్ చేయాలి లేడీ ఏ పని చేయకుండా సాయం చేయాలని అంటే తేజతో ఏకంగా శోభా బ్రష్ కూడా అతనితో చేయించుకుంది. శోభా చేస్తున్న అతి వల్ల తేజ ఆట కూడా చెడిపోతుంది. తేజ కూడా శోభాతో ఇచ్చేది కంటెంటే అని తెలిసేలా చేస్తున్నాడు.

స్టార్ మా బ్యాచ్ అమర్, ప్రియాంకా కూడా ఒకరికొకరు చాలా క్లోజ్. అయితే అమర్ దీప్ మాత్రం బయట ఉన్న తన సీరియల్ ఇమేజ్ కి తగినట్టు మాత్రమ ఆట ఆడట్లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ మీద తన గురి అతన్ని మరింత వెనక్కి నెట్టేలా చేస్తుంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన బోలే పాట బిడ్డగా తనని తాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. కానీ స్టార్ మా బ్యాచ్ మీద అతని రివర్స్ ఎటాక్ ఆడియన్స్ ని విసుగెత్తిస్తుంది. ఆటల్లో ఇంకా అతను పూర్తి స్థాయి పోటీ ఇవ్వట్లేదని చెప్పొచ్చు. ఇక మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని కూడా అంతే.. తనతో మంచిగా ఉంటే ఓకే లేదంటే మాత్రం చెలరేగిపోతుంది. ఏది చెప్పినా సరే ఆమె తీసుకోలేకపోతుంది. అది ఆమె ఆటకి మైనస్ అవుతుంది.

ఇక ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది హౌస్ మెట్స్ ఉన్నారు. అమర్, తేజ, రతిక, ప్రియాంక, శోభా, బోలే, అర్జున్, యావర్ లు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో శోభా, బోలే, తేజ రిస్క్ లో ఉంటారని చెప్పొచ్చు.