Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరో తెలుసా..?

ఇక సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ కి ఎవరైనా గెస్ట్ వస్తున్నారా లేదా అన్న డౌట్ మొదలైంది. ఆ డౌట్స్ క్లారిటీ ఇస్తూ ఫైనల్ ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ ని ఆహ్వానిస్తున్నారట.

By:  Tupaki Desk   |   13 Dec 2023 11:26 AM GMT
బిగ్ బాస్ 7 : ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరో తెలుసా..?
X

బిగ్ బాస్ సీజన్ 7 ఈ ఆదివారం పూర్తి కావొస్తోంది. సండే ఫైనల్ ఎపిసోడ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరన్నది ఆడియన్స్ కు ఎగ్జైట్మెంట్ కలిగిస్తుంది. ప్రతి సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి ఎవరో ఒకరిని గెస్ట్ గా తీసుకొస్తారు. అయితే సీజన్ 6 మాత్రం కేవలం హోస్ట్ నాగార్జున మాత్రమే ఫైనల్ విజేతని అనౌన్స్ చేశారు


ఇక సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ కి ఎవరైనా గెస్ట్ వస్తున్నారా లేదా అన్న డౌట్ మొదలైంది. ఆ డౌట్స్ క్లారిటీ ఇస్తూ ఫైనల్ ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ ని ఆహ్వానిస్తున్నారట. బిగ్గెస్ట్ రియాలిటీ షోలో ఒకటైన బిగ్ బాస్ తెలుగు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. 15 వారాలుగా హౌస్ లో ఉంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు ఆడుతూ ప్రతి వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుని ఫైనల్ సిక్స్ హౌజ్ లో మిగిలారు

వారిలో టైటిల్ విజేత ఎవరన్నది సండే రోజు తెలుస్తుంది. విజేతకి మహేష్ చేతుల మీదుగా టైటిల్ అందచేస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ కి ఎప్పటిలానే 50 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించగా దానితో పాటుగా 15 లక్షల విలువ గల గోల్డ్ ఆర్నమెంట్స్ ఇంకా బ్రీజా కారుని కూడా గిఫ్ట్ గా ఇస్తున్నారు.

బిగ్ బాస్ 7 ఫైనల్స్ కి మహేష్ వస్తున్నారని తెలియగానే బిగ్ బాస్ ఆడియన్స్ కి జోష్ మరింత పెరిగింది. సండే రోజు 7 గంటల నుంచి ఫైనల్ ఎపిసోడ్ మొదలవుతుందని తెలుస్తుంది. స్టేజ్ మీద హోస్ట్ నాగార్జునతో పాటుగా గెస్ట్ గా వచ్చిన మహేష్ టైటిల్ విజేతని ప్రకటిస్తారు. బిగ్ బాస్ స్టేజ్ మీద మహేష్ రావడం జరిగితే అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ మహేష్ ప్రెజన్స్ తో టీ.ఆర్.పి అదిరిపోయేలా వస్తుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి కాగానే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 మొదలు పెడతారని టాక్. ఫిబ్రవరి లో బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ ఉంటుందని చెబుతున్నారు. అయితే దానికి నాగార్జున హోస్ట్ గా చేస్తారా లేదా అన్న క్లారిటీ రావాల్సి ఉంది