Begin typing your search above and press return to search.

వీడియో : గ్రీన్‌ పట్టులో అందాల దివి

బిగ్‌ బాస్ నుంచి వచ్చి స్టార్‌ సెలబ్రెటీ హోదను దక్కించుకున్న ముద్దుగుమ్మల్లో దివి ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   7 Dec 2023 5:34 AM GMT
వీడియో : గ్రీన్‌ పట్టులో అందాల దివి
X

తెలుగు బిగ్ బాస్‌ ఎంతో మంది ముద్దుగుమ్మలను ప్రేక్షకులకు పరిచయం చేసింది అనడంలో సందేహం లేదు. పెద్దగా గుర్తింపు లేని ముద్దుగుమ్మలు బిగ్‌ బాస్ లో అడుగు పెట్టడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులారిటీని సొంతం చేసుకుంటూ ఉన్నారు. బిగ్ బాస్ లో కనిపించిన వారు చాలా మంది ఇప్పుడు సోషల్‌ మీడియాలో హీరోయిన్‌ రేంజ్ స్టార్‌ డమ్ తో అభిమానించబడుతున్నారు.


బిగ్‌ బాస్ నుంచి వచ్చి స్టార్‌ సెలబ్రెటీ హోదను దక్కించుకున్న ముద్దుగుమ్మల్లో దివి ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌ ఫీచర్స్‌ ఫుల్ గా ఉండే దివి కి తెలుగు అమ్మాయి అనే ఒక ట్యాగ్‌ కారణంగా పెద్ద ఆఫర్లు రావడం లేదు. కానీ సోషల్‌ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.


తన ఫాలోవర్స్ ని, నెటిజన్లను ఎప్పటికప్పుడు అలరించేందుకు గాను ముద్దుగుమ్మ దివి తన అందాలను ప్రదర్శిస్తూనే ఉంటుంది. హద్దులు మీరకుండా దివి చేసే అందాల షో ఎప్పుడూ కూడా వైరల్‌ అవుతూ ఉంటుంది. చీర కట్టులో.. మోడ్రన్‌ డ్రెస్ లో ఎలాగైనా కూడా దివి అందం అదరహో అన్నట్లుగా ఉంటుందని టాక్‌.


తాజాగా గ్రీన్‌ పట్టు చీర కట్టులో దివి ఫోటో షూట్‌ పిక్స్ వైరల్‌ అయ్యాయి. తాజాగా ఆ ఫోటో షూట్‌ కి సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేసింది. ఫోటోలతో పాటు వీడియో కూడా అంతకు మించి అన్నట్లుగా ఉందంటూ, మొత్తానికి ఈ గ్రీన్ పట్టులో దివి చాలా అందంగా ఉందంటూ మరోసారి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.