Begin typing your search above and press return to search.

ఖాన్ డాట‌ర్‌తో బిగ్‌బి మ‌న‌వ‌డు NYE డేట్!

షారుఖ్ ఖాన్ - గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ .. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా ఇటీవల జోయా అక్తర్ `ది ఆర్చీస్`తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

By:  Tupaki Desk   |   29 Dec 2023 5:14 AM GMT
ఖాన్ డాట‌ర్‌తో బిగ్‌బి మ‌న‌వ‌డు NYE డేట్!
X

షారుఖ్ ఖాన్ - గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ .. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా ఇటీవల జోయా అక్తర్ `ది ఆర్చీస్`తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో సుహానా-అగ‌స్త్య న‌డుమ సాన్నిహిత్యం పెరిగింద‌ని, ఈ జోడీ ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేక‌పోతున్నార‌ని హిందీ మీడియా క‌థ‌నాలు వైర‌ల్ చేసింది. బాలీవుడ్ లో జెన్ జెడ్ క‌పుల్ అంటూ ప్ర‌చారం కూడా సాగిపోయింది.

ఆ ఇద్ద‌రి న‌డుమా స్నేహం మాత్ర‌మేనా? అంత‌కుమించి ఇంకేదైనా ఉందా? అన్న‌దానిపై చాలా పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే ఈ గాసిప్పుల‌పై సుహానా కానీ, అగ‌స్త్య నందా కానీ ఏనాడూ స్పందించ‌లేదు. అలాగ‌ని ఖండించ‌నూ లేదు. దీంతో ఇప్ప‌టికీ ఇబ్బ‌డిముబ్బ‌డిగా పుకార్లు షికార్ చేస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ పుకార్ల న‌డుమ‌ సుహానా- అగస్త్య ఇటీవల బిగ్ బి మనవరాలు నవ్య నవేలి నందాతో కలిసి విహారయాత్రకు బయలుదేరిన వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ జెన్ జెడ్ స్టార్స్ గురువారం ఉదయం ముంబైలోని కలీనా విమానాశ్రయంలో కనిపించారు. వారు బహుశా న్యూ ఇయర్ వెకేషన్ కోసం విదేశాల‌కు వెళ్లి ఉండవచ్చు అని ఊహాగానాలు సాగుతున్నాయి. అగస్త్యతో పాటు అతని సోదరి నవ్య నవేళి నంద కూడా ఈ ప్ర‌యాణంలో ఉన్నారు. నవ్యకు సుహానా చిన్నప్పటి నుంచి స్నేహితురాలు. అలా త‌న సోద‌రుడితోను స‌న్నిహితంగా ఉంది.

అగస్త్య నంద అతడి సోదరి నవ్య తెలుపు రంగు దుస్తులు ధ‌రించి కవలలుగా క‌నిపించ‌గా, సుహానా బ్లాక్ ట్యాంక్ టాప్, మ్యాచింగ్ ప్యాంట్‌లో క‌నిపించింది. షారుఖ్ ఖాన్ - గౌరీ ఖాన్ ల ఏకైక కుమార్తె సుహానాతో అగస్త్య- నవ్య .. శ్వేతా బచ్చన్ నందా -నిఖిల్ నందాల పిల్లలు. అమితాబ్ బచ్చన్ - జయ బచ్చన్ మనవడు మ‌న‌వ‌రాలు గా సుప‌రిచితులు. వారి మ‌ధ్య స్నేహం సాన్నిహిత్యం ఎల్ల‌పుడూ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఆర్చీస్ జంట‌ గురించి ..

సుహానా, అగస్త్య ఈ సంవత్సరం `ది ఆర్చీస్‌`తో న‌ట‌రంగ ప్రవేశం చేశారు. జోయా అక్తర్ తెర‌కెక్కించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. పరిశ్రమకు చెందిన వారు తమ తొలి ప్రాజెక్ట్ విడుద‌ల స‌మ‌యంలో ఎంతో ఎగ్జ‌యిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ది ఆర్చీస్ భ‌విష్య‌త్ యుగపు మ్యూజికల్ అడ్వెంచ‌ర్ మూవీ. ఆర్చీ (అగస్త్య), వెరోనికా (సుహానా), బెట్టీ (ఖుషీ కపూర్), జుగ్‌హెడ్ (మిహిర్ అహుజా), రెగీ (వేదంగ్ రైనా), ఎథెల్ (అదితి డాట్), డిల్టన్ (యువరాజ్ మెండా)ల జీవితాలను తెర‌పై ఆవిష్క‌రించింది. కల్పిత కొండ ప్రాంతాలైన రివర్‌డేల్ పట్టణంలో ఈ క‌థ సాగుతుంది. ఈ చిత్రం స్నేహం, స్వేచ్ఛ, ప్రేమ, హృదయ విదారక ఘ‌ట‌న‌లు, తిరుగుబాటు వంటి అంశాల‌ను ఆవిష్క‌రించింది.

`ది ఆర్చీస్‌` ప్రచార వీడియోలో సుహానా-అగస్త్య ఒకరి గురించి ఒకరు తెలియని కొన్ని వాస్తవాలను బ‌య‌టి ప్ర‌పంచానికి వెల్లడించారు. సుహానా చాలా పెద్ద గాసిప్ క్వీన్ అని నేను అనుకుంటున్నాను అని అగ‌స్త్య ఆ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించ‌గా, ఛ‌మ‌త్కార‌మైన పిల్లాడు అని సుహానా న‌వ్వేసింది. నేను కలుసుకున్న అతి తక్కువ ఫన్నీ వ్యక్తుల‌లో నువ్వే బెస్ట్ అని సుహానాను పొగిడేశాడు అగ‌స్త్య‌. నీ గురించి నాకు చాలా కాలంగా తెలుసు. నీలో ఫ‌న్ త‌క్కువ‌. చాలా `మూడీ` అని కూడా సుహానా వ్యాఖ్యానించింది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహాన్ని ఈ ప్ర‌చార వీడియోలు రివీల్ చేసాయి.