బిగ్ బాస్ 9 మళ్లీ అదే స్టోరీ రిపీట్..!
ఇదిలాఉంటే సీజన్ 9 లో హోస్ట్ గా నాగార్జున చేస్తారని కొందరు కాదు విజయ్ దేవరకొండ హోస్ట్ చేస్తాడని మరికొందరు అంటున్నారు.
By: Tupaki Desk | 3 April 2025 7:00 AM ISTత్వరలో బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కాబోతుంది. 8 సక్సెస్ ఫుల్ సీజన్లతో ఆడియన్స్ ని అలరించిన బిగ్ బాస్ తెలుగు అతి త్వరలోనే సీజన్ 9 కి రెడీ అవుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ టీం ఈ సీజన్ కోసం కంటెస్టెంట్స్ ఎంపిక మొదలు పెట్టారని తెలుస్తుంది. సీజన్ 9 సంథింగ్ స్పెషల్ గా ఉండేలా మొత్తం సెలబ్రిటీలను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ టీం. ఈసారి మొత్తం టాప్ సెలబ్రిటీస్ తోనే షో నడిపించే ప్లాన్ చేస్తున్నారట.
ఐతే బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ విషయంలో కొన్ని వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. ఈసారి హోస్ట్ గా నాగార్జున చేయరని ఆయన ప్లేస్ లో కొత్త హోస్ట్ వస్తారని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. సీజన్ 3 నుంచి సీజన్ 8 మొత్తం 5 సీజన్లు ఒక నాన్ స్టాప్ అదే 24/7 సీజన్ నాగార్జున హోస్ట్ గా చేశారు. హోస్ట్ గా ఆయన తన మార్క్ చూపిస్తున్నారు.
అఫ్కోర్స్ నచ్చిన వాళ్లు నాగార్జునని పొగడటం.. నచ్చని వాళ్లు నెగిటివ్ గా మాట్లాడట కామనే. సీజన్ 8 లో కంటెస్టెంట్ అయిన సోనియా ఆకుల నాగార్జున హోస్ట్ గా చేస్తే తాను మరోసారి బిగ్ బాస్ వంక చూడనని అన్నది. రానా లాంటి యంగ్ హీరోలు కావాలని అన్నది. ఐతే సోనియా అభిప్రాయం అలా ఉంటే కొందరు ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే మాకు హోస్ట్ గా నాగార్జుననే పర్ఫెక్ట్ అనిపిస్తుందని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలాఉంటే సీజన్ 9 లో హోస్ట్ గా నాగార్జున చేస్తారని కొందరు కాదు విజయ్ దేవరకొండ హోస్ట్ చేస్తాడని మరికొందరు అంటున్నారు. ఐతే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ ప్రతి సీజన్ మొదలయ్యే టైం లో హోస్ట్ మారుతున్నాడంటూ చెప్పడం తీరా చూస్తే నాగార్జున కొనసాగడం కామన్ అయ్యింది. సో ఈ సీజన్ కూడా హోస్ట్ విషయంలో వస్తున్న వార్తలన్నీ ఉత్తుత్తి మాటలేనా లేదా నిజంగానే హోస్ట్ ని మార్చే ఆలోచన ఉందా అన్నది త్వరలో తెలుస్తుంది.
నాగార్జున కూడా షో మీద అంతగా ఆసక్తిగాలేడన్న టాక్ వినిపిస్తుంది. ఐతే విజయ్ దేవరకొండ సినిమాలు కాదని బిగ్ బాస్ చేస్తాడని చెప్పలేం. రానా అయితే ఓకే కానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని అతను హ్యాండిల్ చేయగలడా అన్న డౌట్ అయితే ఉంది. మరి బిగ్ బాస్ టీం ఏం చేస్తుందో చూడాలి.
