Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బిగి స‌డ‌ల‌ని రెడ్ హాట్ అందాలు

ఇది ట్రెండీ రెడ్ హాట్ లుక్. రెడ్ హాట్ లెద‌ర్ ఫ్రాకులో భూమి అంద‌చందాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయి.

By:  Tupaki Desk   |   23 Sep 2023 4:40 AM GMT
ఫోటో స్టోరి: బిగి స‌డ‌ల‌ని రెడ్ హాట్ అందాలు
X

భూమి పెడ్నేక‌ర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాలీవుడ్ లో ట్యాలెంటెడ్ న‌టి. అంత‌కుమించి సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌తో అరుదైన ఫ్యాష‌నిస్టాగా వెలిగిపోతోంది ఈ బ్యూటీ. ఇటీవ‌ల కొన్ని ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఈ బ్యూటీ న‌టించిన తాజా చిత్రం థాంక్యూ ఫ‌ర్ క‌మింగ్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భూమి హంగామా మామూలుగా లేదు. యువ‌న‌టి భూమి పెడ్నేక‌ర్ తాజా ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఇది ట్రెండీ రెడ్ హాట్ లుక్. రెడ్ హాట్ లెద‌ర్ ఫ్రాకులో భూమి అంద‌చందాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ఎంపిక చేసిన డిజైన‌ర్ లుక్ కి త‌గ్గ‌ట్టుగానే లైట్ పింక్ క‌ల‌ర్ లిప్ స్టిక్ ని ధ‌రించిన భూమి అలా ఆత్రంగా త‌న సెల్ ఫోన్ లో ఏదో పరిశీలిస్తూ సెల్ఫీ దిగింది. ఈ రెడ్ హాట్ లుక్ ఇలా ఇన్ స్టాలోకి వ‌చ్చిందో లేదో అలా అంత‌ర్జాలంలో ల‌క్ష‌లాది క్లిక్ లు లైక్ లతో హీట్ పుట్టించింది.


థాంక్యూ ఫ‌ర్ క‌మింగ్:క‌ల్ట్ జాన‌ర్ మూవీ 'థాంక్యూ ఫ‌ర్ క‌మింగ్' ప్ర‌మోష‌న్స్ కోసం భూమి ఫుల్ స్వింగ్ లో ఉందిప్పుడు. భూమి పెడ్నేకర్, కుషా కపిల, షెహనాజ్ గిల్, షిబానీ బేడి, లెజెండరీ అనిల్ కపూర్ లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో న‌టించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. న‌టి కం నిర్మాత‌ రియా క‌పూర్ భ‌ర్త‌ కరణ్ బూలానీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవ‌లే ఈ సినిమా నుంచి పార్టీ గీతం హాంజీ విడుద‌ల కాగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా టీమ్ కొత్త ట్రాక్ 'దేశీ వైన్‌..'ని విడుదల చేసింది. ఇది పెళ్లిళ్ల సీజ‌న్ పై సాగే పాట‌. తాజా ట్రాక్ పేరు దేశీ వైన్. భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీ, కరణ్ కుంద్రా ఈ పాటలో న‌ర్తించారు. ఇది ఆకర్షణీయమైన బీట్‌లతో పెళ్లి పాట‌ల్లో ట్రెండ్ సెట్ట‌ర్ గా మారింది. హాట్ అండ్ గ్లామరస్ లేడీస్ డ్యాన్స్ ఫ్లోర్ పై అగ్గి రాజేసారు. భూమి - షెహనాజ్‌ల డ్యాన్సింగ్ స్టైల్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఖరన్ - I.P సింగ్ రాసిన ఈ పాటకు ఖరాన్ స్వరక‌ర్త‌. ఈ అద్భుతమైన ట్రాక్‌కి గాత్రాన్ని కరణ్, నికితా గాంధీ, ది రిష్ , అర్జున్ అందించారు. ప్రతిభావంతులైన ఫరా ఖాన్ దీనికి కొరియోగ్రఫీ చేశారు.

క‌థాంశం ఇంట్రెస్టింగ్..భూమి పెడ్నేక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో కరణ్ బూలానీ దర్శకత్వం వహించిన తొలి చిత్రం- థ్యాంక్యూ ఫర్ కమింగ్ క‌థాంశం ఎంతో ఆస‌క్తిక‌రం. సెక్స్ లో సంతృప్తి చెంద‌ని ఒక యువతి త‌న భాగ‌స్వాముల‌ను ఎలా ఆడుకుంది? అనేదే ఈ సినిమా క‌థాంశం. ఇది పూర్తి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. రొమాన్స్ కి ప్రాధాన్య‌త ఉంది. ఆ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి విపరీతమైన ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్రాన్ని రియా కపూర్ - ఏక్తా కపూర్ సంయుక్తంగా నిర్మించారు.

బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ - అనిల్ కపూర్ ఫిల్మ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై విడుదల కానుంది. ఇటీవలే ప్రతిష్టాత్మకమైన 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రీమియర్ షోను ప్రదర్శించడం గమనార్హం. ఈ గ్రాండ్‌ ఈవెంట్‌కి టీమ్‌ హాజరయ్యారు. టిఫ్ లో ప్రీమియ‌ర్ వేయ‌గా ఈ చిత్రానికి వీక్ష‌కుల నుండి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఈ ఏడాది అక్టోబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.