Begin typing your search above and press return to search.

క‌లిసొచ్చిన ఫిబ్ర‌వ‌రి..ఈసారి అదే న‌మ్మ‌కంతో!

అయితే ఈ సినిమా ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ అవ్వ‌డం త‌న‌కు సెంటిమెంట్ గా క‌లిసొస్తుంది అన్న ధీమాని వ్య‌క్తం చేసింది.

By:  Tupaki Desk   |   8 Feb 2024 6:27 AM GMT
క‌లిసొచ్చిన ఫిబ్ర‌వ‌రి..ఈసారి అదే న‌మ్మ‌కంతో!
X

బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమీ ప‌డ్నేక‌ర్ వ‌రుస విజాయాల‌తో దూసుకుపోతున్న సంగ‌త తెలిసిందే. గ‌త ఏడాది అమ్మ‌డు ఏకంగా నాలుగు రిలీజ్ లతో మంచి ఫ‌లితాలే సాధించింది. 'భీద్' ..' అఫ్వా' ..' థాంక్యూ ఫర్ కమింగ్' ..'ది లేడీ కిల్లర్' లాంటి విజ‌యాల‌తో మెప్పించింది. తాజాగా అమ్మ‌డు క్రైమ్ థ్రిల్లర్ 'భ‌క్ష‌క్' తోనూ అల‌రించ‌డానికి రెడీ అవుతోంది. ఇందులో అమ్మ‌డు లైంగిక వేధింపుల నుండి బాలికలను ర‌క్షించే జ‌ర్న‌లిస్ట్ పాత్ర పోషించింది.

భూమీని ఈ పాత్ర వ్య‌క్తిగ‌తంగానూ క‌దిలించ‌డంతో ఇలాంటి చిత్రంలో న‌టిండం ప‌ట్ల తాను ఓ బాధ్య‌త‌గా తీసుకున్నట్లు రివీల్ చేసింది. ఇలాంటి పాత్ర‌ల‌తో కొంత‌వ‌ర‌కైనా స‌మాజంలో అవేర్ నెస్ తీసుకురా వొచ్చ‌ని అంటోంది. అయితే ఈ సినిమా ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ అవ్వ‌డం త‌న‌కు సెంటిమెంట్ గా క‌లిసొస్తుంది అన్న ధీమాని వ్య‌క్తం చేసింది. 'సినీ రంగంలో అడుగు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఫిబ్ర‌వ‌రి నెల‌తో నాకెంతో ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది.

'ధ‌మ్ ల‌గా కే హైషా' చిత్రంతో ఎంట్రీ ఇచ్చాను. ఈసినిమా ఫిబ్ర‌వ‌రి లో రిలీజ్ అయి మంచి విజ‌యంతో పాటు నాకెంతో మంచి పేరు తీసుకొచ్చింది. ఎన్నో ప్ర‌శ‌సంలు..గౌర‌వాన్ని ఆ చిత్రం తెచ్చి పెట్టింది. 2022 లో ఇదే నెల‌లో విడుద‌లై 'బధాయి దో' ఇండ‌స్ట్రీలో గేమ్ ఛేంజ‌ర్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఇదే నెల‌లో రిలీజ్ అవుతున్న 'భ‌క్ష‌క్' కూడా అలాంటి హిట్ నే రిపీట్ చేస్తుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నాను.

ఈ సినిమాకి నా మ‌న‌సులో ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఆ రెండు చిత్రంలతో ఎంత ప్రేమ‌ను పొందానే అదే ప్రేమ‌ని భ‌క్ష‌క్ ద్వారా పొందుతాని ఆశిస్తున్నాను. ప్రేక్ష‌కులు నా కోరిక‌..ఆశ‌ను తీర్చుతార‌ని అంతే న‌మ్మ‌కం తోనూ ఉన్నాను' అని అంది. 14 ఏళ్ల వ‌య‌సులో భూమీప‌డ్నే క‌ర్ కూడా లైంగిక వేధింపులు ఎదుర్కున్న‌ట్లు ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సినిమాలో స‌వాల్ తో కూడిన జ‌ర్న‌లిస్ట్ పాత్ర పోషించిన‌ట్లు తెలిపింది.