పిక్ టాక్ : ముసుగు చాటును అందం
మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ భూమి ఫెడ్నేకర్ మొదటి సినిమాకే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 16 Dec 2023 10:00 PM ISTయశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో చాలా సంవత్సరాల పాటు అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించిన భూమి ఫెడ్నేకర్ 2015 లో అదే సంస్థ నిర్మాణంలో రూపొందిన ధామ్ లాగ కె హైసా అనే సినిమా ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్న అనుభంతో నటిగా ఎంట్రీ ఇవ్వడంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ భూమి ఫెడ్నేకర్ మొదటి సినిమాకే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈమె అందమైన ఫోటోలు షేర్ చేస్తూ రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటుంది.
సినిమాలతో పాటు ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలను భూమి ఫెడ్నేకర్ షేర్ చేస్తూ ఉండటం వల్ల ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇలాంటి ఫోటోలతో మరింతగా ఆఫర్లను దక్కించుకుంటూ ఉంది అనడంలో సందేహం లేదు.
తాజాగా ఈ అమ్మడు ఒక మ్యాగజైన్ కోసం ఇచ్చిన బ్రైడల్ ఫోటో షూట్ లో ఇలా మొహం పై ముసుగు ధరించి పెళ్లి కూతురు మాదిరిగా అందమైన తన అందాలను చూపిస్తూ సోషల్ మీడియా ద్వారా సందడి చేసింది. నా బ్రైడల్ ఫాంటసీ అంటూ భూమి ఈ ఫోటోలను షేర్ చేసి కామెంట్ చేసింది.
