Begin typing your search above and press return to search.

హాలీవుడ్‌కి వెళ్లిపోతున్న మ‌రో క్రేజీ బ్యూటీ

చాలా మంది అగ్ర క‌థానాయిక‌లకు హాలీవుడ్ నెక్ట్స్ లెవ‌ల్ డ్రీమ్. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, ఆలియా భ‌ట్ స‌హా చాలా మంది హాలీవుడ్ కి వెళ్లారు

By:  Tupaki Desk   |   21 Feb 2024 11:30 PM GMT
హాలీవుడ్‌కి వెళ్లిపోతున్న మ‌రో క్రేజీ బ్యూటీ
X

చాలా మంది అగ్ర క‌థానాయిక‌లకు హాలీవుడ్ నెక్ట్స్ లెవ‌ల్ డ్రీమ్. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, ఆలియా భ‌ట్ స‌హా చాలా మంది హాలీవుడ్ కి వెళ్లారు. అక్క‌డ అవ‌కాశాలొస్తే న‌టిస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ నటి హాలీవుడ్ బాట పట్టినట్లు తెలుస్తోంది. స‌ద‌రు బ్యూటీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ చిత్రంలో కనిపించింది. జర్నలిస్ట్ పాత్రలో న‌ట‌న‌కు గాను ఈ న‌టీమ‌ణి చాలా ప్రశంసలు అందుకుంది. OTTలో విడుద‌లైన 'భక్షక్'లో భూమి పెడ్నేక‌ర్ న‌ట‌న‌కు గొప్ప పేరొచ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ హాలీవుడ్ కి వెళ్లిపోనుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

తాజా క‌థ‌నాల ప్రకారం.. భూమి పెడ్నేకర్ ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్ట్ లో న‌టించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం భూమి లాస్ ఏంజెల్స్ వెళ్లనున్నట్లు సమాచారం. బాలీవుడ్ హంగామా క‌థ‌నం ప్రకారం.. భూమి పెడ్నేకర్ న‌టిగా ఇప్పుడు ఉన్న‌త స్థాయిలో ఉంద‌ని, త‌న‌ ప్రాజెక్ట్‌లు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయని టాక్ ఉంది. భక్షక్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. త‌న న‌ట‌నుకు చాలా ప్రశంసలు కురుస్తున్నాయి. భూమికి హాలీవుడ్ లో న‌టించాల‌నే ఆకాంక్ష ఉంద‌ని అయితే తనకు వచ్చే ఏ ఆఫర్‌ను ఎంచుకోవాలో ఆలోచిస్తోంద‌ని తెలిసింది. భూమి ఇటీవ‌ల‌ తన స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా ఎంచుకుంటుంది. హాలీవుడ్ అరంగేట్రంపై పూర్తి నిర్ణయం తీసుకోనుంది. భూమి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుండ‌డం వ‌ల్ల ఏదైనా సినిమాలో భారతీయ మహిళలను సరిగ్గా చిత్రీకరించడం చాలా ముఖ్యం. కాబట్టి హాలీవుడ్ ఎంపిక విష‌య‌మై తన దృష్టికి న్యాయం చేసే సరైన పాత్ర కోసం అన్వేషిస్తోంది. త‌న‌కు వ‌చ్చే ఆఫర్‌లను అంచనా వేయడానికి ప్ర‌య‌త్నిస్తోంది.

'దమ్ లగా కే హైషా' నుండి 'భక్షక్' వరకు భూమి పెడ్నేకర్ సినీపరిశ్రమలో చాలా ఎత్తుకు ఎదిగారు. భూమి న‌టిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, గోవింద నామ్ మేరా, భధాయి దో, చాంద్ కీ ఆంఖ్ స‌హా విభిన్న చిత్రాలలో న‌టించి మెప్పించింది. ఇటీవలి చిత్రం థాంక్యూ ఫర్ కమింగ్ లో బోల్డ్ పాత్ర‌లో న‌టించింది. తదుపరి బాలీవుడ్ ప్రాజెక్ట్ మేరీ పత్నీ కా రీమేక్‌లో అర్జున్ కపూర్ త‌దిత‌రులు కలిసి నటించారు.