తక్కువ చేసి చూస్తే అమ్మడితో అణు విస్పోటనమే!
బాలీవుడ్ లో భూమీ పెడ్నేకర్ ఎలా ఎదిగిందన్నది చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిన్న పాత్రలతో ప్రయాణం మొదలు పెట్టి అంచలంచెలుగా నటిగా ఎదిగింది.
By: Srikanth Kontham | 1 April 2026 8:00 AM ISTబాలీవుడ్ లో భూమీ పెడ్నేకర్ ఎలా ఎదిగిందన్నది చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిన్న పాత్రలతో ప్రయాణం మొదలు పెట్టి అంచలంచెలుగా నటిగా ఎదిగింది. అక్కడ నుంచి కథానాయికగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే కెరీర్ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, విమర్శలను ఆమె స్వీకరించే విధానం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. తనను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా? లేదా తన సామర్థ్యాన్ని తక్కువ చేసి చూసినా? భూమి ఏమాత్రం కుంగిపోకుండా ఆ ప్రతికూలతను తన విజయానికి మెట్టుగా మార్చుకోవడం ఆమెలో పట్టుదలకు నిదర్శనం.
భూమి పెడ్నేకర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ `తనను ఎవరైనా తక్కువ చేసి చూసినప్పుడు తనలో ఓ అణు విస్ఫోటనం లాంటి కసి పుడుతుందంది. ఈ మాటతో ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యం పట్ల ఆమెకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయి. విమర్శలు వచ్చినప్పుడు నిరాశకు గురికాకుండా? ఆ శక్తిని సానుకూల మార్గంలో మళ్లించి పనితనంతో సమాధానం చెప్పడమే ఆమె నైజం. మాటల కంటే చేతలే బలమైనవని అమ్మడు గట్టిగా నమ్ముతుందని తెలుస్తోంది. భూమీ పడ్నేకర్ ప్రయాణం మొదలైనప్పటి నుండి తనను విమర్శించిన వారం దరికీ తన నటనతోనే సమాధానం చెబుతున్నానంది.
ప్రతి సినిమాతోనూ ఓ అడుగు ముందుకే వేస్తుంది తప్ప వెనక్కి కాదని చాటి చెబుతుంది. విమర్శలు ఎదురైన సందర్భంలో అమ్మడిలో తెలియని శక్తి పుట్టుకొచ్చి మరింత ఉత్తమమైన పాత్రలను ఎంచుకోవడానికి? వాటిలో అత్యుత్తమంగా నటించడానికి ప్రేరేపిస్తుందని భూమి తెలిపింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు వచ్చిన తర్వాత మహిళా ప్రధాన చిత్రాలకు మరింత ప్రాధాన్యత పెరిగిందని భూమి అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ సమాజంలో సినిమా రంగం పట్ల కొన్ని అపోహలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మహిళలు రాణిస్తున్నారని గుర్తు చేసింది.
స్క్రిప్ట్‌ల ఎంపికలో మహిళలు చాలా ధైర్యవంతులని రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని నమ్ముతారంది. ఇలాంటి ధైర్యమే తనను కూడా ముందుకు నడిపిస్తోందని గుర్తు చేసుకుంది. తనని తక్కువ చేసి చూసినప్పుడు అది తనకు ఒక సవాలుగా అనిపిస్తుందంది. ఆ సవాలును స్వీకరించి తానేంటో నిరూపిం చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తానని తెలిపింది. అలాగని ఆవిషయాలేవి వ్యక్తిగతంగా తీసుకోనంది.ట్యాలెంట్ , నటనతో సమాధానం చెబితే? అదే ప్రతి దాడి అవుతుందంది.
ప్రస్తుతం భూమీ పడ్నేకర్ సినిమాల స్పీడ్ తగ్గించింది. గత ఏడాది `మేరీ హస్బెండ్ కీ బివీ` అనే చిత్రంలో నటించింది. కానీ ఆ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. అంతకు ముందు ఏడాది `భక్షక్`,` ఖేల్ ఖేల్ మెయిన్` చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆవి ఆశించిన ఫలితాలు సాధించలేదు. ప్రస్తుతం అమ్మడు కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అలాగే ప్రభుత్వం చేపడుతోన్న అవేర్ నెస్ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటుంది. కొన్ని స్వచ్చంద సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గానూ పని చేస్తోంది.
