Begin typing your search above and press return to search.

క్రేజీ ఫ్రాంఛైజీలోకి వేడెక్కించే బ్యూటీ

ఈ హర్రర్ కామెడీలో మాధురీ దీక్షిత్ కీలక పాత్ర పోషిస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారిక ధృవీక‌ర‌ణ లేదు

By:  Tupaki Desk   |   2 April 2024 4:12 PM GMT
క్రేజీ ఫ్రాంఛైజీలోకి వేడెక్కించే బ్యూటీ
X

బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీగా భూల్ భుల‌యాకు చాలా ప్ర‌త్యేక‌త ఉంది. అక్ష‌య్ కుమార్ త‌ర్వాత యువ‌హీరో కార్తీక్ ఆర్య‌న్ కి కూడా ఇమేజ్ పెంచిన ఫ్రాంఛైజీ ఇది. భూల్ భుల‌యా -1లో అక్ష‌య్ కుమార్ న‌టించ‌గా, భూల్ భుల‌యా -2లో ట్యాలెంటెడ్ కార్తీక్ ఆర్యన్ న‌టించాడు. ప్ర‌స్తుతం భూల్ భూలయ్యా 3 చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. రెండవ భాగంలో క‌థానాయ‌కుడిగా న‌టించిన కార్తీక్ ఆర్యన్ మరోసారి పార్ట్ 3లోను రూహ్ బాబాగా కనిపించనున్నాడు. మొదటి భాగంలో కథానాయికగా నటించిన విద్యాబాలన్ ఈ చిత్రంతో ఫ్రాంచైజీకి తిరిగి రావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ మ‌రింత పెరిగింది.

ఈ హర్రర్ కామెడీలో మాధురీ దీక్షిత్ కీలక పాత్ర పోషిస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారిక ధృవీక‌ర‌ణ లేదు. బాలీవుడ్ మీడియాలో తాజా నివేదికల ప్రకారం.. మాధురి ఈ ప్రాజెక్టుకు ఇప్ప‌టికే సంత‌కం చేసింద‌ని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో మాధురి తన పోర్షన్స్ షూటింగ్ స్టార్ట్ చేయనుందిట‌. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇతర షెడ్యూల్స్‌కు సన్నాహాలు చేస్తున్నారు. యానిమల్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ట్రిప్తి డిమ్రీ, కార్తీక్ ఆర్యన్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఈ చిత్రం 2024 దీపావళి బ‌రిలో విడుదల కానుంది.

భూల్ భుల‌యా 3లో న‌టిస్తున్న విద్యాబాల‌న్ తెలుగు ఆడియెన్ కి సుప‌రిచితురాలు. క్రిష్ తెర‌కెక్కించిన‌ ఎన్టీఆర్ బయోపిక్ లో బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో బాల‌న్ న‌టించారు. అంత‌కుముందు విజ‌య‌వాడ యువ‌తి, ఐట‌మ్ భామ‌ సిల్కుస్మిత జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ డ‌ర్టీ పిక్చ‌ర్ లో విద్యాబాల‌న్ న‌టించారు. సిల్కు పాత్ర‌లో త‌న న‌ట‌న‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. హిందీ చిత్ర‌సీమ‌లో అరుదైన విల‌క్ష‌ణ‌మైన న‌టిగా బాల‌న్ కి ఉన్న ఇమేజ్ భూల్ భుల‌యా3 కు పెద్ద ప్ల‌స్ కానుంది.