Begin typing your search above and press return to search.

సాయి పల్లవి పేరు చెప్పి భోళా జీ పై ట్రోల్స్‌

రకరకాలుగా భోళా శంకర్ ను ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా సాయి పల్లవి పేరు తో ఈ సినిమాపై ట్రోల్స్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   14 Aug 2023 6:57 AM GMT
సాయి పల్లవి పేరు చెప్పి భోళా జీ పై ట్రోల్స్‌
X

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచింది. సినిమా పై యాంటీ మెగా ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్స్‌ చేస్తున్నారు. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం ను భోళా శంకర్ గా రీమేక్ చేసి తప్పు చేశారు అంటూ కొందరు విమర్శలు చేస్తూ ఉంటే కొందరు మాత్రం చిరంజీవి ఈ రీమేక్ చేయకుండా ఉండాల్సింది అనేది కొందరి అభిప్రాయం.

రకరకాలుగా భోళా శంకర్ ను ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా సాయి పల్లవి పేరు తో ఈ సినిమాపై ట్రోల్స్ చేస్తున్నాయి. చిరంజీవి కి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించిన విషయం తెల్సిందే. ఆమె పాత్ర కు మరియు నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ పాత్ర కోసం మొదట కీర్తి సురేష్ ను కాకుండా సాయి పల్లవి ని సంప్రదించిన విషయం తెల్సిందే.

సాయి పల్లవి మరియు చిరంజీవి మధ్య ఈ విషయమై ఒకానొక సమయంలో ఒక స్టేజ్ పై చర్చ కూడా వచ్చింది. భోళా శంకర్ లో చిరంజీవి కి చెల్లి పాత్రలో నటించేందుకు సాయి పల్లవి నిరాకరించడం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అదే విషయమై కొందరు సోషల్‌ మీడియా ద్వారా ట్రోల్స్ చేస్తూ భోళా శంకర్ ను విమర్శిస్తున్నారు.

భోళా శంకర్ సినిమా లో చిరంజీవి చెల్లెలు పాత్రను సాయి పల్లవి చేయకుండా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. ఆమె కనుక భోళా శంకర్‌ ను చేసి ఉంటే కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్ అన్నట్లుగా నిలిచేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాయి పల్లవి తిరస్కరించి మంచి పని చేసింది. కానీ భోళా శంకర్‌ లో చెల్లి పాత్ర చేసి కీర్తి సురేష్ బలైపోయింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.