Begin typing your search above and press return to search.

భోళాశంకర్ యూఎస్​ఏ కలెక్షన్స్​.. ఇది పరిస్థితి

తాజాగా యూఎస్​ఏ ప్రీమియర్స్​ అండ్ ఫస్డ్ డే వసూళ్ల వివరాలు తెలిశాయి.

By:  Tupaki Desk   |   12 Aug 2023 12:45 PM GMT
భోళాశంకర్ యూఎస్​ఏ కలెక్షన్స్​.. ఇది పరిస్థితి
X

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంకర్'​ భారీ డిజాస్టర్ టాక్​ను అందుకున్న సంగతి తెలిసిందే. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్​ తర్వాత మళ్లీ ఆ రేంజ్​లో చిరు మరో డిజాస్టర్​ను మూటగట్టుకున్నారు. సోషల్​మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా ట్రోల్సే తెగ ట్రెండ్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్​, కామన్​ ఆడియెన్స్ అందరూ ఓ ఆటాడేసుకుంటున్నారు. మొదటి నుంచే ఈ సినిమాపై కాస్త హైప్ తక్కువ ఉండడంతో తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. అలాగే ఓవర్సీస్​లోనూ ఇదే జరిగింది.

తాజాగా యూఎస్​ఏ ప్రీమియర్స్​ అండ్ ఫస్డ్ డే వసూళ్ల వివరాలు తెలిశాయి. చిరంజీవి నటించిన గత సూపర్ హిట్​ సినిమా వాల్తేరు వీరయ్య.. యూఎస్​ఏలో ప్రీమియర్స్​ ద్వారా 679కే డాలర్స్​ను వసూలు చేస్తే.. టోటల్​ థియేట్రికల్​ రన్​ టైమ్​ పూర్తయ్యేసరికి 2 మిలియన్ డాలర్ల మార్క్​ను చేరుకుంది.

అయితే భోళాశంకర్ మాత్రం ప్రీమియర్స్ ద్వారా కేవలం 303కే డాలర్స్​తో సరిపెట్టుకుంది. అంటే వాల్తేరు వీరయ్య కలెక్షన్లతో సగం అన్న మాట. ఇక ఫస్ట్ డే అయితే మరీ దారుణంగా 82కే డాలర్లను అందుకుంది. అంటే మొత్తంగా ప్రీమియర్స్​- మొదటి రోజు కలిపి 358కే డాలర్స్​ను ఖాతాలో వేసుకుంది.

ఈ కలెక్షన్స్​ వివరాలు బయటకు రావడంతో ఈ మూవీ ఫస్ట్​ వీకెండ్​లో 600కే డాలర్ల మార్క్​ను అందుకోవడం కష్టమని చెబుతున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ సినిమా మొత్తం థియేట్రికల్​​ రన్​ టైమ్​​ అయ్యేసరికి 1 మిలియన్ డాలర్​ మార్క్​ను చేరుకోవడం అసలు అయ్యే పనే కాదని అంటున్నారు.

దీంతో ఈ భోళాశంకర్ సినిమా డిజాస్టర్ టాక్​ దిశగా దూసుకెళ్తోందని అంచనా వేస్తున్నారు. అంతకుముందు భారీ డిజాస్టర్​ను అందుకున్న ఆచార్య అయితే.. యూఎస్​లో మొత్తం​ థియేట్రికల్​ రన్​ టైమ్ పూర్తయ్యేసరికి 985కె డాలర్లను కలెక్ట్ చేసింది. మరి కనీసం ఈ వసూళ్లనైనా భోళశంకర్ అందుకుంటుందో లేదో చూడాలి..

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 18.38 కోట్లు షేర్, 28.54లో గ్రాస్ మాత్రమే అందుకుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొదటిరోజు 15.38 కోట్లు షేర్, 22.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ 79.60 కోట్లు. అంటే ఈ చిత్రం ఇంకా రూ. 62.12 కోట్ల వరకు అందుకోవాలి.