Begin typing your search above and press return to search.

భోళా శంకర్.. ఈ నెంబర్ గట్టిగానే..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వస్తోన్న చిత్రం భోళా శంకర్

By:  Tupaki Desk   |   11 Aug 2023 4:33 AM GMT
భోళా శంకర్.. ఈ నెంబర్ గట్టిగానే..
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వస్తోన్న చిత్రం భోళా శంకర్. ఈ రోజు థియేటర్స్ లో భోళా శంకర్ సందడి షురూ అయ్యింది. మెహర్ రమేష్ దశాబ్దకాలం తర్వాత దర్శకుడిగా తిరిగి తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. భారీ బడ్జెట్ తో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. తమన్నా మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలు పాత్రలో కనిపిస్తోంది. ఆమె పాత్ర మూవీలో చాలా కీలకంగా ఉండనుంది. వేదాళం రీమేక్ గా వస్తోన్న చిత్రం అయిన కూడా భోళా శంకర్ లో మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని చాలా మార్పులు చేశారు. సుమారు 80.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. ఓవిధంగా టార్గెట్ పెద్దదే అయినా మెగాస్టార్ మానియాతో మొదటి వారంలోనే టార్గెట్ కలెక్షన్స్ వచ్చేస్తాయని ఆశిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో 8 వందలు థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ ఉండగా ప్రపంచ వ్యాప్తంగా 1500 వరకు థియేటర్స్ ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఓవర్సీస్ లో భారీ స్క్రీన్స్ లో భోళా శంకర్ రిలీజ్ కాబోతోంది.రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ ని ఈ మూవీతో అందుకోవాలని భావిస్తున్నారు.

అయితే అది ఎంత వరకు సాధ్యమవుతుందనేది చూడాలి. భోళా శంకర్ మూవీ హిట్ అయితే మెగాస్టార్ మళ్ళీ రీమేక్ కథలపై దృష్టి పెట్టె ఛాన్స్ ఉంటుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం నడుస్తోంది.

భోళా శంకర్ రిలీజ్ తర్వాత కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో మూవీని మెగాస్టార్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ప్రసన్నకుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ అందించారు. మెగాస్టార్ ని మూవీలో యువ హీరో తండ్రిగా చూపించబోతున్నారంట.