Begin typing your search above and press return to search.

భోళా శంకర్ బాక్సాఫీస్.. హాలీడే రోజు వచ్చింది ఇది!

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా కొనసాగుతోంది.

By:  Tupaki Desk   |   16 Aug 2023 7:33 AM GMT
భోళా శంకర్ బాక్సాఫీస్.. హాలీడే రోజు వచ్చింది ఇది!
X

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా కొనసాగుతోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ వేదళం రీమేక్ పై మొదటి నుంచి కూడా అనుకున్నంత స్థాయిలో అయితే అంచనాలు లేవు. ఇక చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గానే కనిపించారు. తప్పకుండా ఫ్యాన్స్ కు ఈ సినిమా మంచి కిక్ అయితే ఇస్తుంది అనే అనుకున్నారు.

కానీ ఊహించని విధంగా మొదటి రోజే సినిమాకు చాలా తక్కువ స్థాయిలోనే కలెక్షన్స్ వచ్చాయి. మెగాస్టార్ ఆచార్య కంటే ఇప్పుడు భోళా శంకర్ దారుణమైన డిజాస్టర్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే మంగళవారం ఆగస్టు 15 కావడంతో ఈ హాలిడేను కూడా భోళా సినిమా పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది.

మరోవైపు పోటీగా జైలర్ సినిమా భీభత్సమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఎక్కువగా తెలుగు ఆడియోన్స్ ఆ సినిమా వైపే ఫోకస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నాలుగో రోజు 25 లక్షలు అందుకుంటే 5వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోటి రూపాయల షేర్ అయితే సొంతం చేసుకుంది. ఇక మొత్తంగా ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భోళా శంకర్ కు వచ్చిన షేర్ 22.94 కోట్లు గ్రాస్ 34.95 కోట్లు.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా కర్ణాటక అలాగే రెస్టాఫ్ ఇండియా వైపు నుంచి ఇప్పటివరకు 1.80 కోట్లు మాత్రమే షేర్ అందుకుంది. ఇక ఓవర్సీస్ లో 2.20 కోట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ కూడా సినిమా దారుణంగా నష్టాలను కలిగించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా భోళా శంకర్ సినిమా ఐదు రోజుల్లో 26.94 కోట్లు షేర్ 42.85 కోట్లు గ్రాస్ అందుకుంది.

సినిమా ఈ స్థాయిలో తక్కువ కలెక్షన్స్ అందుకుంటుంది అని ఎవరు ఊహించలేదు. ఇక ఓవరాల్ గా ఈ సినిమా 79 కోట్ల రేంజ్ లో అయితే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే 80 కోట్లకు పైగా షేర్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 53 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వెనక్కి తీసుకురావాల్సి ఉంది. కానీ ఆగస్టు 15వ చివరి హాలిడే. మళ్లీ వీకెండ్ వరకు సినిమాకు కలిసి వచ్చే అవకాశం లేదు. కానీ ఈ వారంలోనే చాలా థియేటర్ల నుంచి ఈ సినిమాను తీసేసే అవకాశం ఉన్నట్లుగా తేలుస్తోంది.