Begin typing your search above and press return to search.

భోళా శంకర్.. సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది

పెద్దగా కట్స్ ఏమి లేకుండానే U/A సర్టిఫికెట్ దక్కింది. సెన్సార్ అభ్యంతరాలు అయితే పెద్దగా లేవట

By:  Tupaki Desk   |   2 Aug 2023 2:28 PM GMT
భోళా శంకర్.. సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది
X

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈనెల 11వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. తమిళంలో లో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకున్న వేదళం సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కింది. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా ఈ దర్శకుడు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకొని మళ్ళీ ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని అనుకుంటున్నాడు.

ఇక వాల్తేరు వీరయ్యతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మరో కమర్షియల్ సక్సెస్ అందుకొని తన మార్కెట్ను మరింత పెంచుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి.

పెద్దగా కట్స్ ఏమి లేకుండానే U/A సర్టిఫికెట్ దక్కింది. సెన్సార్ అభ్యంతరాలు అయితే పెద్దగా లేవట. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఒక సీరియస్ డ్రామా అలాగే కామెడీ రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు.

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగానే మెగాస్టార్ ను ప్రజెంట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ సినిమాపై అనుకున్నంత స్థాయిలో అయితే అంచనాలు పెరగలేదు. విడుదలైన సాంగ్స్ కూడా అంతంత మాత్రమే క్లిక్ అయ్యాయి. ఇక టీజర్ ట్రైలర్ కూడా ఊహించని స్థాయిలో అయితే యూట్యూబ్లో రికార్డులను క్రియేట్ చేయలేదు.

ప్రస్తుతం వరకు కూడా ఈ సినిమాకు అంచనాలు తక్కువగానే ఉన్నాయి. ఇక సినిమా విడుదలైన తర్వాతనే కంటెంట్ క్లిక్ అయితే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అయితే అందుకునే అవకాశం ఉంటుంది. ఇక భోళా శంకర్ సినిమా దాదాపు 90 కోట్ల రేంజ్ లో అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తప్పకుండా 100 కోట్లు అందుకుంటేనే ఈ సినిమా హిట్టయినట్లు లెక్క.

ఇక భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ కు జోడిగా తమన్నా భాటియా నటించగా కీర్తి సురేష్ సోదరి పాత్రలో నటించారు. ఇక అక్కినేని హీరో సుశాంత్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు. మరి కంటెంట్ ఆడియన్స్ కు ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందో చూడాలి.