Begin typing your search above and press return to search.

భోళాశంక‌ర్ ఊహించ‌ని ట్విస్టు.. త‌మ్ముడినే దించేశాడుగా..

తాజాగా చిరు లీక్స్

By:  Tupaki Desk   |   17 July 2023 3:52 AM GMT
భోళాశంక‌ర్ ఊహించ‌ని ట్విస్టు.. త‌మ్ముడినే దించేశాడుగా..
X

త‌న అభిమానుల‌కు ప్ర‌తిసారీ ఏదో ఒక స్పెష‌ల్ ట్రీట్ ఇవ్వ‌నిదే మెగాస్టార్ చిరంజీవి హ్యాపీగా ఉండ‌రు. దానికోసం ఆయ‌న శ్ర‌మించే తీరు(హార్డ్ వ‌ర్క్)కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 60 ప్ల‌స్ ఏజ్ లోను ఎంతో ఛామింగ్ లుక్ తో క‌నిపిస్తున్న మెగాస్టార్ దీనికోసం చాలా శ్ర‌మిస్తున్నారని అర్థ‌మ‌వుతోంది. ఇప్పుడు 'భోళాశంక‌ర్' లో 30ఏళ్ల యువ‌కుడిలా క‌నిపిస్తూ చిరు అంద‌రికీ షాకిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు వీడియోల్లో చిరు ఎంతో యంగ్ లుక్ తో క‌నిపించారు.

ఆగ‌స్టు 11న విడుద‌ల‌కు వ‌స్తున్న భోళాశంక‌ర్ ప్ర‌మోష‌న్స్ ని వైవిధ్యంగా ప్లాన్ చేస్తూ మెగాస్టార్ త‌న‌దైన యూనిక్ నెస్ ని చాటుకుంటున్నారు. ఇప్పుడు ఆయ‌న ఇచ్చిన ట్విస్టు మామూలుగా లేదు. మెగా ఫ్యాన్స్ కి డ‌బుల్ ధ‌మాకా ట్రీట్ ని మెగాస్టార్ ప్లాన్ చేసారు.

తాజాగా చిరు లీక్స్ పేరుతో ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ రిలీజ్ చేసిన వీడియోలో చిరు అదిరిపోయే శుభ‌వార్త‌ను అందించారు. త‌మ్ముళ్ల‌ను ఎవ‌రికీ లీక్ చేయ‌కండ‌ని కోరుతూనే అస‌లు విష‌యం చెప్పేసారు చిరు.

ప్ర‌తిసారీ ప‌వ‌ర్ స్టార్ త‌న సినిమాల్లో చిరుని ఇమ్మిటేట్ చేస్తుంటారు. చిరు డైలాగులను అనుక‌రించి అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ ఇస్తుంటారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా త‌మ్ముడినే అన్న‌య్య అనుక‌రిస్తున్నారు. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ డైలాగ్స్ మేన‌రిజ‌మ్స్ ని భోళాశంక‌ర్ లో చిరు ఇమ్మిటేట్ చేస్తున్నాన‌ని స్వ‌యంగా చిరు లీక్స్ వీడియో ద్వారా వెల్ల‌డించారు.

మొత్తానికి చిరు లీక్స్ అందించిన తాజా వార్త‌తో మెగాభిమానులు సంబ‌రాల్లో మునిగి తేల్తున్నారు. ఫ్యాన్స్ కి డ‌బుల్ ధ‌మాకా ట్రీట్ అన‌డంలో సందేహం లేదు. వాల్తేరు వీర‌య్య చిత్రంతో సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు భోళాశంక‌ర్ తో మ‌రో హిట్టు కొట్టాల‌ని క‌సిగా ప‌ని చేస్తున్నారు. మెహ‌ర్ ర‌మేష్ కి ఇది గ్రేట్ కంబ్యాక్ అవుతుంద‌ని ఆశిద్దాం.

ఇక ఏజెంట్ చిత్రంతో ఫ్లాప్ అందుకున్న‌ ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ కి భోళాశంక‌ర్ రూపంలో పెద్ద‌ హిట్టు ద‌క్కుతుంద‌ని ఆకాంక్షిద్దాం. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ అందించిన స్వ‌రాలు నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన అస్సెట్ కానున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పాట‌ల‌కు అద్భుత స్పంద‌న వ‌స్తోంది.