Begin typing your search above and press return to search.

భీమా.. ఏదో ఏదో మాయ

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది

By:  Tupaki Desk   |   10 Feb 2024 2:58 PM GMT
భీమా.. ఏదో ఏదో మాయ
X

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం భీమా. హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైథాలజీ కాన్సెప్ట్ ని రిలేట్ చేస్తూ థ్రిల్లర్ జోనర్ లో ఈ యాక్షన్ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు. కన్నడలో కమర్షియల్ సక్సెస్ లు అందుకున్న ఏ హర్షకి తెలుగులో ఇదే మొదటి చిత్రం. గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు.


ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గోపిచంద్ గత సినిమాలకంటే భిన్నంగా ఈ మూవీ కథాంశం ఉండబోతోందని అర్ధమవుతోంది. మాళవిక శర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని శుక్రవారం రిలీజ్ చేశారు. ఏదో ఏదో మాయా అంటూ సాగే మెలోడియస్ గీతాన్ని ప్రేక్షకులకి అందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ గీతానికి కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించడం విశేషం.

ఈ సినిమాకి రవి బసూర్ మ్యూజిక్ డైరెక్టర్. కేజీఎఫ్ సిరీస్ తో ఇప్పటికే రవి బసూర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ చిత్రంతో తెలుగులో కూడా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. హీరో, హీరోయిన్ మధ్య చిత్రీకరించిన ఈ లవ్ మెలోడీ సాంగ్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే అప్పుడే 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

అలాగే ట్రెండింగ్ లో కూడా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ సాంగ్ కి 1.4 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. గోపీచంద్ కెరియర్ లో భారీ అంచనాల నడుమ భీమా మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. మార్చిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. మూవీ కచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. యాక్షన్ సీక్వెన్స్ అంటే గోపీచంద్ కి నెక్స్ట్ లెవల్ లో ఉంటాయనే సంగతి తెలిసిందే.

ఇందులో కావాల్సినంత యాక్షన్ గూస్ బాంబ్స్ సీక్వెన్స్ ఉన్నాయంటే. కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ సెకండ్ లీడ్ గా ఈ చిత్రంలో నటిస్తోంది.