Begin typing your search above and press return to search.

ప‌వర్‌ఫుల్ మాకో కాప్ 'భీమా' క‌మింగ్

ఇది గోపిచంద్ ఇమేజ్ ని పెంచే విధంగా ఉంటుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. భీమా చిత్రం ఫస్ట్ టీజర్ జనవరి 5న విడుదల కానుండగా, ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే టైటిల్ డిజైన్ ఇప్ప‌టికే విడుద‌లై సినిమాపై అంచనాలను పెంచేశాయి.

By:  Tupaki Desk   |   3 Jan 2024 4:00 PM GMT
ప‌వర్‌ఫుల్ మాకో కాప్ భీమా క‌మింగ్
X

మాకో హీరో గోపీచంద్ కెరీర్ ప‌రంగా ఆచితూచి అడుగులేస్తున్న సంగ‌తి తెలిసిందే. మాస్ యాక్ష‌న్ హీరోగా అత‌డికి ఉన్న ఇమేజ్ కి త‌గ్గ కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు అత‌డు గూస్ బంప్స్ తెచ్చే అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ చిత్రంతో బ‌రిలోకి వస్తున్నాడు. నూతన దర్శకుడు హర్ష దర్శకత్వం వహించిన అత‌డి కొత్త చిత్రం 'భీమ'లో యాక్ష‌న్ పీక్స్ లో ఉంటుంద‌ని చెబుతున్నారు. తాజాగా టీజర్‌ను సిద్ధం చేస్తున్నందున ఫ‌స్ట్ ఛార్జ్ ఏ రేంజులో ఉంటుందో చూడాల‌న్న కుతూహాలం అభిమానుల్లో ఉంది.


కొంత గ్యాప్ తర్వాత గోపీచంద్ పూర్తి స్థాయి యాక్షన్ ఫిల్మ్‌తో వస్తున్నందున అతడిని భయంకరమైన యాక్ష‌న్ అవతార్‌లో చూడ‌బోతున్నామ‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇది గోపిచంద్ ఇమేజ్ ని పెంచే విధంగా ఉంటుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. భీమా చిత్రం ఫస్ట్ టీజర్ జనవరి 5న విడుదల కానుండగా, ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే టైటిల్ డిజైన్ ఇప్ప‌టికే విడుద‌లై సినిమాపై అంచనాలను పెంచేశాయి.

టీజర్ ఆ తేదీన మధ్యాహ్నం 1:11 గంటలకు విడుదల కానుంది. KGF ఫేమ్ రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్ర‌ధాన ఆయుధంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. రొటీన్ కంటెంట్ రొటీన్ యాక్ష‌న్ సినిమాల‌కు కాలం చెల్లింది. కేజీఎఫ్‌- స‌లార్ చిత్రాలు చూశాక అభిమానులు స్టంట్స్ ఆ రేంజులో ఉండాల‌ని కోరుకుంటున్నారు. అందువ‌ల్ల ఇప్పుడు ప్ర‌భాస్ స్నేహితుడే అయిన మ‌న‌ మాకో హీరో కూడా సూప‌ర్ హీరోగా మారాల్సిన త‌రుణం వ‌చ్చేసింద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భీమాగా గోపి ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్ ఏ విధంగా ఉందో వేచి చూడాలి. అత‌డు ఖాకీ ఫ్యాంట్ ధ‌రించాడు కాబ‌ట్టి ప‌వ‌ర్ ఫుల్ కాప్ పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇంతకుముందు గోపీచంద్‌తో పంతం చిత్రాన్ని నిర్మించిన కెకె రాధా మోహన్ నిర్మించిన భీమా వేసవిలో థియేటర్లలో విడుద‌ల‌వుతుంది.