Begin typing your search above and press return to search.

గోపీచంద్ భీమా.. రేట్లు పెరుగుతున్నాయే..

ఆయన స్టైల్ కథతోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 4:54 AM GMT
గోపీచంద్ భీమా.. రేట్లు పెరుగుతున్నాయే..
X

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం భీమా. ఈ మూవీ మార్చిలో రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రవితేజ కెరియర్ లో భారీ బడ్జెట్ తో థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమాని రాధా మోహన్ నిర్మించారు.

రాధామోహన్ ఎక్కువగా గోపీచంద్ హీరోగానే సినిమాలు చేస్తున్నారు. అయితే నిర్మాతగా ఆయనకి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. కానీ భీమాతో మాత్రం బ్లాక్ బస్టర్ కొడతామనే నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. కన్నడంలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా హర్షకి మంచి పేరుంది. అతను తెలుగులోకి డెబ్యూ చేస్తోన్న మూవీ ఇది.

ఆయన స్టైల్ కథతోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రవి బసూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తూ ఉండటం అదనపు ఆకర్షణగా ఉంది. దీంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఉందని చెప్పాలి. ఈ కారణంగానే కెరియర్ లో వరుస డిజాస్టర్ లు ఉన్నా కూడా భీమా సినిమాకి డిస్టిబ్యూటర్స్ ని మంచి ఆఫర్స్ వస్తున్నాయంట.

ఇక ఈ సినిమాని 8 కోట్ల రేషియోతో ఆంధ్రా ప్రాంతం రైట్స్ ని రాధామోహన్ అమ్మకానికి పెట్టారంట. వైజాగ్ ఏరియానే 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమాకి పాజిటివ్ టాక్ ఉన్న నేపథ్యంలో ఈ రేషియోకి రైట్స్ కొనడానికి డిస్టిబ్యూటర్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. అయితే గత సినిమాల ట్రాక్ రికార్డ్ మాత్రం భయపెడుతోంది.

ఏది ఏమైనా ఈ సినిమాతో ఇటు హీరోగా గోపీచంద్ కి, అటు నిర్మాత కెకె రాధామోహన్ కి సాలిడ్ సక్సెస్ కావాల్సిందే. అలాగే రవి బసూర్ కి తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలంటే ఈ మూవీతో హిట్ కొట్టాలి. దర్శకుడిగా హర్ష కూడా ఈ చిత్రంతో టాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టి నెక్స్ట్ స్టార్ హీరో డేట్స్ సంపాదించాలని చూస్తున్నారు.