Begin typing your search above and press return to search.

భీమా టీజర్ టాక్: బ్రహ్మ రాక్షసుడు వచ్చేశాడు

తాజాగా మేకర్స్ భీమా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు

By:  Tupaki Desk   |   5 Jan 2024 8:03 AM GMT
భీమా టీజర్ టాక్: బ్రహ్మ రాక్షసుడు వచ్చేశాడు
X

టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న తాజా చిత్రం భీమా. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండ‌గా.. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి మోష‌న్ పోస్ట‌ర్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్ విడుద‌ల చేయ‌గా.. అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా మేకర్స్ భీమా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. యధా యధా ధర్మస్య శ్లోకం తో మొదలైన టీజర్ తెగ ఆకట్టు కుంటోంది. గోపి చంద్ ఎలివేషనలు అదిరిపోయాయి. టీజర్ తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ఆద్యంతం ఆసక్తికరంగ్గా టీజర్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

ఈ రాక్షసుడుని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచాడ్రా అంటూ బ్యాక్ గ్రౌండ్ డైలాగు వస్తుంటే గోపి చంద్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. దున్నపోతు పై హీరో పోజు కేక అని నెటిజన్లు అంటున్నారు. ఈ సినిమా తో గోపీచంద్ కమ్ బ్యాక్ పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ హీరో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

తమ టీమ్ అందరం ఎంతో కష్టపడ్డ భీమా తప్పక విజయం అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. eka శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. సలార్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ కొరియోగ్రఫీలో ఫైట్స్ ఉండబోతున్నాయి.

ఇక సినిమా రిలీజ్ పై చాలా రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు మేకర్స్ ఒక సమాధానం ఇచ్చారు. మొత్తానికి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. తప్పకుండా ఈ సినిమాతో గోపిచంద్ సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా కాలంగా అతనికి బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేదు. ముఖ్యంగా చివరి సినిమా రామబాణం దారుణంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో గోపి ఈ సినిమాతో తప్పనిసరిగా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. మరి అతనికి ఈ సినిమా ఎలాంతో ఫలితాలు అందిస్తుందో చూడాలి.