Begin typing your search above and press return to search.

భీమ్స్ మీద పెద్ద బాధ్యత.. నెక్స్ట్ ఛాన్స్ కూడా..?

భీమ్స్ కూడా స్వతహాగా మెగాస్టార్ కి వీరాభిమాని. సో అలా ఆయనతో సినిమా ఛాన్స్ అందుకోవడం లక్కీ అని చెప్పొచ్చు. భీమ్స్ సిసిరోలియో మెగా 157 సినిమాకు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   31 Aug 2025 12:18 PM IST
భీమ్స్ మీద పెద్ద బాధ్యత.. నెక్స్ట్ ఛాన్స్ కూడా..?
X

టాలీవుడ్ లో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో దూసుకెళ్తున్నాడు. కాస్త ఫోక్ టచ్ ఎక్కువగా కనిపించే అతని పాటలు హృదయాలనికి హత్తుకుంటాయి. ముఖ్యంగా ఊరు పల్లెటూరు సాంగ్ తో భీమ్స్ సిసిరోలియో తన మార్క్ మ్యూజిక్ తో మనసులు గెలిచాడు. ఆ పాటకి నేషనల్ అవార్డ్ సైతం వచ్చింది అంటే భీమ్స్ పనితనం ఏంటో తెలుస్తుంది. ఐతే భీమ్స్ సిసిరోలియో ఇప్పటిదాకా ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి మరో లెక్క అనేలా పరిస్థితి కనిపిస్తుంది. అలా ఎందుకు అంటే మొన్నటిదాకా భీమ్స్ కేవలం టైర్ 2 అండ్ యంగ్ హీరోల సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు.

మన శంకర వరప్రసాద్ గారు..

కెరీర్ లో ఫస్ట్ టైం భీమ్స్ సిసిరోలియో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు భీమ్స్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ ఛాన్స్ ని భీమ్స్ అన్ని విధాలుగా వాడుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే భీమ్స్ సెసిరోలియో ఇప్పటివరకు ఇచ్చిన సినిమాల సాంగ్స్ అన్నీ ఒక ఎత్తైతే.. మెగాస్టార్ చిరంజీవి సినిమా మరో ఎత్తు అని చెప్పొచ్చు.

భీమ్స్ కూడా స్వతహాగా మెగాస్టార్ కి వీరాభిమాని. సో అలా ఆయనతో సినిమా ఛాన్స్ అందుకోవడం లక్కీ అని చెప్పొచ్చు. భీమ్స్ సిసిరోలియో మెగా 157 సినిమాకు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అనిల్ రావిపూడి, భీమ్స్ సిసిరోలియో కలిసి విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పనిచేశారు. ఆ సినిమా మ్యూజికల్ గా కూడా హిట్ అయ్యింది. ఇప్పుడు మెగా మూవీ మెగాస్టార్ సినిమాకు కూడా భీమ్స్ పనిచేస్తున్నాడు.

మిగతా యాస్పెక్ట్స్ తో పాటు డ్యాన్స్ లు కూడా..

చిరంజీవి సినిమా అంటే మిగతా యాస్పెక్ట్స్ తో పాటు డ్యాన్స్ లు కూడా క్రేజీగా ఉంటాయి. ఆ డ్యాన్స్ బాగా రావాలంటే మ్యూజిక్ అదిరిపోయే రేంజ్ లో ఇవ్వాలి. సో అలా భీమ్స్ మీద పెద్ద బాధ్యత ఉంది. ఐతే ఈ సినిమాకు సూపర్ హిట్ సాగ్స్ ఇస్తే.. మెగాస్టార్ మరో సినిమా ఛాన్స్ కూడా ఇస్తానని చెప్పారట. సో మన శంకర వర ప్రసాద్ గారు మ్యూజిక్ పరంగా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం భీమ్స్ సెసిరోలియోకి మరో మెగా మూవీ ఛాన్స్ వచ్చినట్టే లెక్క. ఈమధ్యనే వచ్చిన టీజర్ చూసి మెగా ఫ్యాన్స్ అయితే సూపర్ అనేస్తున్నారు.