Begin typing your search above and press return to search.

సంక్రాంతికి భీమ్స్ డబల్ ఫీస్ట్..!

దేవి శ్రీ ప్రసాద్, థమన్ తర్వాత టాలీవుడ్ లో ఈమధ్య వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో అదరగొట్టేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో.

By:  Tupaki Desk   |   26 Dec 2025 4:00 PM IST
సంక్రాంతికి భీమ్స్ డబల్ ఫీస్ట్..!
X

దేవి శ్రీ ప్రసాద్, థమన్ తర్వాత టాలీవుడ్ లో ఈమధ్య వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో అదరగొట్టేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో. మొన్నటిదాకా యువ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించిన భీమ్స్ మాస్ మహరాజ్ రవితేజ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అదనపు ఆకర్షణ కానుంది.

మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు.. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి..

ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. సంక్రాంతికి ఈసారి తన సినిమాతో తనే పోటీ పడుతున్నాడు భీమ్స్. పొంగల్ రేసులో మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ తో పాటుగా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా వస్తుంది. ఈ రెండు సినిమాలకు భీమ్స్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఐతే రెండిటి కథ వేరైనా రెండు సినిమాలు ఎంటర్టైన్మెంట్ మోడ్ లోనే వస్తున్నాయి.

అనిల్ రావిపూడి సినిమా అంటే పక్కా ఎంటర్టైన్మెంట్ అన్నట్టే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ మరోసారి సంక్రాంతికి అదే రేంజ్ సక్సెస్ కోసం ఎం.ఎస్.జితో వస్తున్నాడు. ఐతే ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ కూడా మంచి మెలోడియస్ గా ఇంప్రెస్ చేస్తుంది. మరోపక్క రవితేజ బి.ఎన్.డలయు సినిమాకు కూడా రవితేజ ఫ్యాన్స్ కి నచ్చే మాస్ బీట్స్ తో ఆకట్టుకుంటున్నాడు.

స్పెషల్ ఇంట్రెస్ట్ తో భీమ్స్..

సంక్రాంతికి రెండు సినిమాలతో భీమ్స్ మ్యూజిక్ ఆడియన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతుంది. సినిమా రిలీజ్ ముందు హంగామా అయితే బాగుంది. సాంగ్స్ మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా భీమ్స్ ఈ రెండు సినిమాలకు స్పెషల్ ఇంట్రెస్ట్ తో చేస్తున్నాడని తెలుస్తుంది. భీమ్స్ సిసిరోలియో ఒకే సీజన్ లో రెండు క్రేజీ సినిమాలతో రావడం సంథింగ్ స్పెషల్ గా ఉంది. మరి ఈ రెండు సినిమాలు మ్యూజికల్ గా కూడా హిట్ అనిపించుకుంటే మాత్రం భీమ్స్ కి ఇక తిరుగు ఉండదని చెప్పొచ్చు. ఇప్పటికే యువ హీరోల సినిమాల నుంచి స్టార్ ఛాన్స్ లు అందుకుంటున్న భీమ్స్ చిరంజీవి సినిమా తర్వాత మరింత దూకుడు పెంచే ఛాన్స్ ఉంటుంది.

సంక్రాంతికి వస్తున్నాం తో వెంకటేష్ తో పనిచేసిన భీమ్స్ ఇప్పుడు మన శంకర వరప్రసాద్ తో చిరు సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ బాలకృష్ణ, నాగార్జున కూడా భీమ్స్ తో పనిచేసే ఛాన్స్ లేకపోలేదు. యువ సంగీత దర్శకుడిగా తన మాస్ మ్యూజిక్ తో ఆడియన్స్ ని అలరిస్తున్న భీమ్స్ సంక్రాంతికి రాబోతున్న రెండు సినిమాలతో హిట్ కొట్టాలని కోరుతున్నారు ఆడియన్స్.