బాలయ్య కోసం రంగంలోకి భీమ్స్!
సంగీత దర్శకుడిగా భీమ్స్ పేరిప్పుడు మార్మోగిపోతుంది. `మ్యాడ్`, `మ్యాడ్ స్క్వేర్`, `టిల్లు స్క్వేర్` లాంటి చిత్రాలతో యువతకు బాగా కనెక్ట్ అయ్యాడు.
By: Tupaki Desk | 25 May 2025 4:00 PM ISTసంగీత దర్శకుడిగా భీమ్స్ పేరిప్పుడు మార్మోగిపోతుంది. `మ్యాడ్`, `మ్యాడ్ స్క్వేర్`, `టిల్లు స్క్వేర్` లాంటి చిత్రాలతో యువతకు బాగా కనెక్ట్ అయ్యాడు. `సంక్రాంతి వస్తున్నాం` సక్సెస్ తో ఏకంగా స్టార్ లీగ్ లోనే పడ్డాడు. గోదారి గట్టు మీద రామ చిలక అంటూ ఓ ఊపు ఊపేసాడు. దీంతో చిరంజీవి పిలిచి మరి తన సినిమాకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి 157వ సినిమా దర్శకుడు భీమ్స్ అన్న సంగతి తెలిసిందే.
అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. అనీల్ కు కూడా భీమ్స్ పనితనం తెలుసు కాబట్టి? మరో సారి ఛాయిస్ గా మారాడు. తాజాగా నటసింహ బాలకృష్ణ కూడా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తదుపరి చిత్రం గోపీచంద మలినేనితో ఉంటుందని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వీరసిం హారెడ్డితో బ్లాక్ బస్టర్ అందుకున్న కాంబినేషన్ ఇది. మళ్లీ అలాంటి హిట్ రిపీట్ చేయాలని చేతులు కలుపుతున్నారు.
ఇదే సినిమాకు భీమ్స్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ2` తెరకెక్కుతోంది. దీనికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. `అఖండ`కు బ్లాక్ బస్టర్ బీజీఎమ్ ఇవ్వడంతో రెండవ భాగం బీజీఎమ్ తో ఏకంగా థియేటర్ల టాప్ లేచి పోవడం ఖాయమంటూ థమన్ ముందే హెచ్చరించాడు. ఆ రేంజ్ లో తన మ్యూజిక్..బీజీఎమ్ ఉంటుం దని చెప్పేసాడు.
బాక్సులు...స్పీకర్లు పగిలిపోతే తనకేం సంబంధం లేదని హెచ్చరించాడు. ఈ మధ్య కాలంలో బాలయ్య ఏ సినిమా చేసినా థమన్ మాత్రమే సంగీత దర్శకుడవుతున్నాడు. అయితే భీమ్స్ ఎంట్రీతో తదుపరి సినిమా విషయంలో కొత్త దనం కోరు కుంటున్నట్లు తెలుస్తోంది.
