భవతీ భిక్షాందేహి... ఇదేం టైటిల్ మావ?
సినిమా విజయంలో టైటిల్ పాత్ర అత్యంత కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్య కాలంలో ఫిల్మ్ మేకర్స్ చాలా తెలివిగా ఆలోచించి మరీ సినిమాలకు టైటిల్స్‌ను పెడుతున్నారు.
By: Tupaki Desk | 7 Jun 2025 4:03 PM ISTసినిమా విజయంలో టైటిల్ పాత్ర అత్యంత కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్య కాలంలో ఫిల్మ్ మేకర్స్ చాలా తెలివిగా ఆలోచించి మరీ సినిమాలకు టైటిల్స్‌ను పెడుతున్నారు. మరికొందరు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయడం కోసం అన్ని భాషలకు సూట్ అయ్యే విధంగా ఒకే టైటిల్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య పాన్ ఇండియా టైటిల్స్ కామన్ అయ్యాయి. థియేట్రికల్ రిలీజ్ కాకున్నా ఓటీటీ స్ట్రీమింగ్ అయిన సమయంలో అయినా టైటిల్ విషయంలో ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో అన్ని భాషలకు కామన్‌గా ఉండే విధంగా టైటిల్‌ను ఖరారు చేస్తున్నారు. అయితే పూరి జగన్నాథ్ తన కొత్త సినిమాకు అనుకుంటున్న టైటిల్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
విజయ్ సేతుపతి, టబు ముఖ్య పాత్రల్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు 'బెగ్గర్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. బిచ్చగాడు ని ఇంగ్లీష్‌లో బెగ్గర్ అంటారనే విషయం తెల్సిందే. తెలుగులో బెగ్గర్ టైటిల్ ఓకే కానీ, తమిళ్‌లో ఇంగ్లీష్ టైటిల్‌కి ఎక్కువ రీచ్ ఉండదు. అంతే కాకుండా తమిళనాడులో సినిమాల టైటిల్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే బెగ్గర్ కాకుండా మరేదైనా టైటిల్‌ను పెట్టాలని విజయ్ సేతుపతి సూచించాడట. అందుకే బెగ్గర్ కాకుండా అన్ని భాషలకు సెట్ అయ్యే విధంగా భవతీ భిక్షాందేహి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ టైటిల్‌తోనే తెలుగు, తమిళ్‌లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కథకు తగ్గట్లుగా ఈ సినిమా బెగ్గర్ చుట్టూ తిరుగుతుందట. అందుకే ఈ టైటిల్‌ను ఖరారు చేసి ఉంటారు అంటున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా బిచ్చగాడు, బిచ్చగాడు 2 సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలు విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అదే కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. భవతీ భిక్షాందేహి సినిమా టైటిల్ విషయంలో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఇదేం టైటిల్ మావ అంటూ మీమ్స్ చేస్తూ ఉంటే, మరికొందరు మాత్రం పూరి డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడు అంటున్నారు.
విజయ్ సేతుపతితో పాటు ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే సైతం కీలక పాత్రలో నటించబోతుంది అనే వార్తలు వచ్చాయి. కానీ తాను ఈ సినిమాలో నటించడం లేదని రాధిక ఆప్టే ప్రకటించింది. టబు కాకుండా ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉండే అవకాశం ఉంది. ఆ హీరోయిన్ ఎవరు అనేది షూటింగ్ ప్రారంభం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ మధ్య నివేదా థామస్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఈ సినిమా మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. పూరి గత చిత్రాలు లైగర్, డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అందుకే ఈ సినిమాపై చాలా అంచనాలను ఆయన ఫ్యాన్స్ పెట్టుకున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో అనేది చూడాలి.
