Begin typing your search above and press return to search.

1980లో భాస్క‌ర్- కుమారి ప్రేమ‌క‌థ మెరుపులే

కింగ్ నాగార్జున న‌టించిన `నా సామి రంగ` సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌కు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Jan 2024 4:15 AM GMT
1980లో భాస్క‌ర్- కుమారి ప్రేమ‌క‌థ మెరుపులే
X

కింగ్ నాగార్జున న‌టించిన `నా సామి రంగ` సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌కు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. నాగ్-ఆషికా రంగ‌నాథ్ ఇందులో జంట‌గా న‌టిస్తుండ‌గా, రాజ్ త‌రుణ్‌- రుక్షార్ థిల్లాన్ ఒక జంట‌గా క‌నిపించ‌నున్నారు. అలాగే అల్ల‌రి న‌రేష్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. తాజాగా భాస్కర్ (రాజ్ తరుణ్)- కుమారి (రుక్సార్ ధిల్లాన్) జంట ప్రేమ‌క‌థ‌కు సంబంధించిన గ్లింప్స్ ని చిత్ర‌బృందం విడుద‌ల చేసింది.

1980ల నాటి యంగ్ క‌పుల్ ప్రేమ‌క‌థ ఈ వీడియోలో ఆక‌ట్టుకుంది. భాస్కర్ - కుమారి మ‌ధ్య అద్భుత‌మైన రొమాన్స్ తెర‌పై వ‌ర్క‌వుటైందన‌డానికి ఇది ఎగ్జాంపుల్. ఇంకా స్కూల్ కి వెళ్లే వ‌య‌సులోనే రాజ్ త‌రుణ్ ఉన్నాడ‌ని విజువ‌ల్స్ నిరూపించిన తీరు ఆక‌ట్టుకుంది. రుక్షార్ ప్ర‌తి ఫ్రేమ్ లో ఎంతో నేచుర‌ల్ గా అందంగా క‌నిపించింది. కుమారి కోసం చైనా గోడ అయినా దూకడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ భాస్క‌ర్ (రాజ్) త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచిన తీరు ఆక‌ట్టుకుంది. ఈ యువ‌జంట ప్ర‌తి చిన్న డీటెయిలింగ్ తో ఎక్స్ ప్రెష‌న్స్ ని ప‌లికించిన తీరు క్యూట్ గా క‌నిపించింది. ఇది 80ల కాలంలో జ‌రిగిన ప్రేమ‌క‌థ కాబ‌ట్టి దానికి త‌గ్గ‌ట్టు నేప‌థ్యాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ వీడియోలో అల్ల‌రి న‌రేష్- నాగ్ మ‌ధ్య అనుబంధాన్ని కూడా చూపించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది.

నా సామి రంగ జనవరి 14న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌వుతోంది. ఆస్కార్ విజేతలు MM కీరవాణి -చంద్రబోస్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మాస్ అప్పీల్ ఉన్న పాట‌లు అభిమానుల్లోకి దూసుకుపోతున్నాయి. సంక్రాంతి బ‌రిలో వెంక‌టేష్ న‌టించిన సైంధ‌వ్, ర‌వితేజ న‌టించిన ఈగిల్ చిత్రాల‌తో నాగ్ చిత్రం పోటీప‌డ‌నున్న సంగ‌తి తెలిసిందే.