#NTR వారసుడు చిచ్చరపిడుగు నో డౌట్
తాజాగా ఫ్యాన్ గ్రూప్స్ షేర్ చేసిన ఇన్‌స్టా లింక్‌లో చురుకైన భార్గవ్ రామ్ ఫోటో హైలైట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోను చూస్తుంటే, అది భార్గవ్ రామ్ స్కూల్ లో డ్రాయింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నప్పుడు తీసిన ఫోటోలా కనిపిస్తోంది.
By: Sivaji Kontham | 27 Feb 2026 9:27 AM ISTఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుతారు. కానీ తన కుమారులైన అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చినప్పుడల్లా అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఎన్టీఆర్ మాస్ ఫ్యాన్స్ వీటిని వైరల్‌గా షేర్ చేయడంలో ఎప్పుడూ వెనక్కి తగ్గరు.
ఎన్టీఆర్ ఇద్దరు కుమారులు నిజంగానే చిచ్చరపిడుగులు. వారి వయస్సు, చదువు వివరాలలోకి వెళితే.. పెద్ద కుమారుడు అభయ్ రామ్ 2014లో జన్మించాడు. ప్రస్తుతం తన వయస్సు సుమారు 11 ఏళ్లు. 6వ లేదా 7వ తరగతి చదువుతున్నాడు. భార్గవ్ రామ్ చిన్న కుమారుడు. ఈ బాలుడు 2018లో జన్మించాడు. ప్రస్తుతం తన వయస్సు 7 ఏళ్లు. 2వ తరగతి చదువుతున్నాడు. వీరిద్దరూ హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతున్నారని సమాచారం.
తాజాగా ఫ్యాన్ గ్రూప్స్ షేర్ చేసిన ఇన్‌స్టా లింక్‌లో చురుకైన భార్గవ్ రామ్ ఫోటో హైలైట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోను చూస్తుంటే, అది భార్గవ్ రామ్ స్కూల్ లో డ్రాయింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నప్పుడు తీసిన ఫోటోలా కనిపిస్తోంది. తన చేతిలో ఉన్న పెయింటింగ్ ని చూసారా? ఏనుగు బొమ్మను సాయంసంధ్యలో ఎంత అందంగా ఆవిష్కరించాడు? ఒక కళాకారుడి బిడ్డ అని నిరూపించాడు. అతడు అక్కడ ఆ బొమ్మను చూపిస్తూ నిలబడ్డ తీరు చూస్తుంటే భార్గవ్ లో కామిక్ కోణం కూడా బయటపడుతోంది.
సాధారణంగా ఎన్టీఆర్ భార్య ప్రణతి పిల్లల ఆలనాపాలనా, స్కూల్ యాక్టివిటీస్‌ను దగ్గరుండి చూసుకుంటారు. భార్గవ్ రామ్ అచ్చం తన తండ్రి పోలికలతో ముఖ్యంగా ఆ కళ్ళలో ఉన్న తీక్షణతతో తారక్ చిన్నప్పటి రోజులను గుర్తు చేస్తున్నాడని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
కుమారులతో ఎన్టీఆర్ అనుబంధం
ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం సమయం కేటాయిస్తారు. షూటింగ్స్ లేనప్పుడు భార్య, పిల్లలతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. పిల్లలకు మన సంప్రదాయాలు తెలియాలని ఇంట్లో జరిగే ప్రతి పూజలో వారిని కూర్చోబెడతారు. వారికి సంస్కృతిని అలవాటయ్యేలా సహకరిస్తున్నారు. తారక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా పిల్లలు నా లోకం.. వారితో గడిపితే నా ఒత్తిడి అంతా పోతుంది! అని పేర్కొన్నారు.
ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ ఎంతవరకూ వచ్చింది?
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఒక భారీ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం ప్రశాంత్ నీల్ మోషన్ క్యాప్చర్ సాంకేతికతతో పాటు, అత్యాధునిక వీఎఫ్.ఎక్స్ వాడుతున్నారు. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నా ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నీల్ బృందం ప్లాన్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా చాలా వైలెంట్ పాత్రలో కనిపిస్తారని, ప్రభాస్ `సలార్` కంటే భారీ యాక్షన్ సీన్లు ఇందులో ఉంటాయని టాక్.
