Begin typing your search above and press return to search.

మహేష్ అన్న కూతురు.. కుర్చీ మడతపెట్టి..

మాస్ లేదు.. క్లాస్ లేదు.. ఎవరైనా ఈ సాంగ్ కు రీల్ చేయాల్సిందే అన్నంతగా పాపులర్ అయింది

By:  Tupaki Desk   |   19 Feb 2024 2:21 PM GMT
మహేష్ అన్న కూతురు.. కుర్చీ మడతపెట్టి..
X

'రాజ‌మండ్రి రాగ‌మంజరి.. మా అమ్మ పేరు తెల‌వ‌నోళ్లు లేరు మేస్త్రీ... క‌ళాకార్ల‌ ఫ్యామిలీ మ‌రి.. నే గ‌జ్జె క‌డితే నిదుర‌పోదు నిండు రాత్రి.. ఈ లిరిక్స్ వింటే చాలు ఎవరైనా ఊగిపోవాల్సిందే. సంక్రాంతికి విడుదలైన మహేశ్ బాబు గుంటూరు కారం మూవీలోని ఈ పాట ఎలాంటి బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఇప్పటికీ ఇదే పాట వినిపిస్తోంది.

మాస్ లేదు.. క్లాస్ లేదు.. ఎవరైనా ఈ సాంగ్ కు రీల్ చేయాల్సిందే అన్నంతగా పాపులర్ అయింది. చిన్నా,పెద్దా తేడా లేకుండా ఈ సాంగ్ కు మాస్ స్టెప్పులతో అదరగొట్టేస్తున్నారు. తెగ రీల్స్ చేసేస్తున్నారు. ఇటీవల మహేశ్ బాబు డాటర్ సితార కూడా ఈ పాటకు డ్యాన్స్ చేసి ఫిదా చేసింది. తండ్రి పాటకు కూతురు అదిరిపోయే స్టెప్పులు వేసిందంటూ మహేశ్ ఫ్యాన్స్ మురిసిపోయారు. ఇప్పుడు బాబాయ్ పాటకు కూతురు డ్యాన్స్ తో దుమ్మురేపింది.

మహేశ్ అన్నయ్య దివంగత రమేశ్ బాబు కూతురే ఘట్టమనేని భారతి. అప్పుడప్పుడు నమ్రత, సితారతో కనిపించే ఈ అమ్మాయి.. సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ అనే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు భారతి ఫస్ట్ టైమ్ తన డ్యాన్స్ వీడియోను పంచుకుంది. కుర్చీ మడతపెట్టి పాటకు మాస్ ఎనర్జిటిక్ స్టెప్పులు వేసి ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేసింది. సాంగ్ కు అడిక్ట్ అయ్యా అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇక భారతి డ్యాన్స్ వీడియోపై సితార వరుస కామెంట్స్ తో తన హ్యాపీనెస్ ను షేర్ చేసుకుంది. లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్, గార్జియస్ ఉమెన్ అంటూ రచ్చ రచ్చ చేసింది. మరోవైపు, నెటిజన్లు అయితే భారతి డ్యాన్స్ కు ఫిదా అయిపోయారు. ఏం స్పీడ్.. ఏం గ్రాస్.. సింప్లీ సూపర్బ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రీ లీల రేంజ్ లో డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టిందని అంటున్నారు.

ప్రస్తుతం భారతి డ్యాన్స్ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. మరోవైపు, భారతి.. తన ఇన్ స్టా బయోలో డ్రైవ్ ఇన్ సినిమా అని పెట్టుకుంది. దీంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఈమె ఎంట్రీ ఇవ్వనుందని నెటిజన్లు అంటున్నారు. ఈమె హీరోయిన్ గా పక్కా సక్సెస్ అవుద్దని అప్పుడే జోస్యం చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.