Begin typing your search above and press return to search.

భరతనాట్యం మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. వేసవి కానుకగా భరతనాట్యం మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లోకి సినిమా రాబోతున్నట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   15 March 2024 4:42 AM GMT
భరతనాట్యం మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
X

టాలీవుడ్ ఇండస్ట్రీకి యంగ్ హీరోలు ఇటీవల తెగ పరిచయమవుతున్నారు. కొత్త కాన్సెప్టులతో డెబ్యూ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్టుల్లో చాలా మంది హీరోహీరోయిన్లుగా ఇప్పటికే ఎంట్రీ ఇవ్వగా.. మరికొందరు యంగ్ టాలెంటెడ్ యాక్టర్లు.. తమ ఫస్ట్ మూవీలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కోవకు చెందిన సూర్యతేజ ఏలే.. భరతనాట్యం మూవీతో టాలీవుడ్ కు డెబ్యూ ఇస్తున్నారు.

దొరసాని మూవీ ఫేమ్ కేవీఆర్ మహేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీఆర్ ఫిల్మ్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ పాయల్ సరాఫ్ నిర్మిస్తున్నారు. మీనాక్షీ గోస్వామి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్.. సినీ ప్రియులను ఆకట్టుకుంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.

తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. వేసవి కానుకగా భరతనాట్యం మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లోకి సినిమా రాబోతున్నట్లు తెలిపారు. అయితే సమ్మర్ హాలిడేస్ ను భరతనాట్యం సినిమా క్యాష్ చేసుకోబోతోందని అర్ధం అవుతోంది. విడుదల తేదీతోపాటు హీరో హీరోయిన్ల రొమాంటిక్ సింగిల్.. చేశావ్ ఏదో మాయ సాంగ్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో హీరో తన జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొనే ఫిల్మ్ మేకర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ లో ఈ విషయం అర్ధమవుతోంది. ప్రోమోల్లో సూర్య తేజ తన నటనతో బాగానే ఆకట్టుకున్నట్టు కనిపిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. వెంకట్ ఆర్ శాకమూరి డీవోపీగా వ్యవహరిస్తున్నారు. రవితేజ గిరిజాల ఈ సినిమాకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

సూర్య తేజ, మీనాక్షితో పాటు వైవా హర్ష, హర్ష వర్ధన్, అజయ్ ఘోష్, సలీం, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్, సంతోష్ బాలకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ రోజే.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ కూడా విడుదల కానుంది. మరి సూర్య తేజ తన డెబ్యూ మూవీ భరతనాట్యంతో హిట్ కొడతారా? లేదా? అనేది వేచి చూడాలి.