Begin typing your search above and press return to search.

భన్వర్ సింగ్ షేకవత్.. ఈసారి మరింత వైల్డ్

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప 2 పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి

By:  Tupaki Desk   |   8 Aug 2023 6:37 AM GMT
భన్వర్ సింగ్ షేకవత్.. ఈసారి మరింత వైల్డ్
X

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప 2 పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ సాధించిన విజయంతో ఇప్పుడు చిత్ర యూనిట్ సీక్వెల్ ను అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురావాలి అని హార్డ్ వర్క్ అయితే చేస్తోంది. అసలైతే పుష్ప 2 ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ మొదటి విజయం వారిపై బాధ్యతను మరింత పెంచేసింది. దీంతో మొదట రాసుకున్న స్క్రిప్ట్ కూడా చేంజ్ చేసిన సుకుమార్ ఇప్పుడు ప్రతి సన్నివేశాన్ని మరింత పవర్ఫుల్ గా తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.


ఇక ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు గ్యాప్ లేకుండా చాలా వేగంగా కొనసాగింది. ఇక మధ్య మధ్యలో కొన్ని బ్రేకులు అయితే పడుతున్నాయి. కానీ ప్లాన్ ప్రకారం పూర్తిచేసేలా సుకుమార్ మాత్రం ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో విలన్స్ ను ఈసారి మరింత పవర్ఫుల్ గా చూపించేందుకు కూడా సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

టాలెంటెడ్ నటుడు ఫాహద్ ఫాజిల్ మొదటి పార్ట్ లో విలన్ వేశంతో ఏ స్థాయిలో ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భన్వర్ సింగ్ షేకవత్ పాత్రలో అతను వెండితెరపై కనిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. బన్నీకి సరైన పోటీ అనే ఫస్ట్ పార్ట్ లోనే కొన్ని సీన్స్ తోనే క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కూడా అతని పాత్ర మరింత వైల్డ్ గా ఉండబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది.

నేడు ఫాహాద్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన పోస్టర్ వదిలారు. బర్త్ డే విషెస్ అందిస్తూ భన్వర్ సింగ్ షేకవత్ ఈసారి మరింత రఫ్ గా కనిపించబోతున్నట్లు చెప్పకనే చెప్పేసారు. ఈ లుక్ లో ఫహద్ నల్ల కళ్ళజోడు పెట్టుకుని గుండుతో కనిపిస్తున్నాడు. ఇక సిగరెట్ తాగుతూ అతని హావ భావాలు కూడా సైకోను తలపిస్తున్నాయి.

ఇక ఇలాంటి విలన్ ను పుష్పరాజ్ ఎలా ఎదుర్కొంటాడు అనే ఊహతోనే సుకుమార్ అంచనాలను మరింత పెంచేస్తున్నాడు. తప్పకుండా పుష్ప 2లో అతని క్యారెక్టర్ మాత్రం హై వోల్టేజ్ వాతావరణాన్ని తలపిస్తుందని అనిపిస్తోంది. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ ను ఈ ఏడది చివరిలోపు ఫినిష్ చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు ఇక సినిమాను అదే సమ్మర్లో విడుదల చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. మరి అప్పటివరకు సినిమా పూర్తవుతుందో లేదో చూడాలి.