Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఒక చెత్త షో అంటున్న బన్నీ హీరోయిన్‌

ఇప్పుడు ఆమెకు బిగ్ బాస్ షో పై ఎందుకు కోపం వచ్చిందో అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే కొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 11:57 AM GMT
బిగ్ బాస్ ఒక చెత్త షో అంటున్న బన్నీ హీరోయిన్‌
X

బిగ్ బాస్ షో ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. పేర్లు వేరు అయినా కూడా అదే ఫార్మట్ లో షో ఎన్నో దేశాల్లో నడుస్తున్న విషయం తెల్సిందే. ఇండియాలో హిందీలో సుదీర్ఘ కాలంగా బిగ్ బాస్ షో నడుస్తోంది. ఎంతో మంది హీరోయిన్స్ నుంచి మొదలుకుని, సోషల్ మీడియా సెలబ్రెటీల వరకు ఎంతో మంది బిగ్ బాస్ షో లో పాల్గొన్నారు.


ఇక తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఆరు సీజన్‌ లను పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ కూడా జరిగింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తోంది. తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 7 గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. తెలుగు బిగ్‌ బాస్‌ తో పాటు అన్ని భాషల బిగ్ బాస్ లకు ఆరంభంలో లేదా ఏదో ఒక సమయంలో వివాదం రాజుకుంటూనే ఉంటుంది.

తాజాగా అల్లు అర్జున్‌ వరుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన భాను శ్రీ బిగ్ బాస్ గురించి షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆమెకు బిగ్ బాస్ షో పై ఎందుకు కోపం వచ్చిందో అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే కొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉన్నారు. బిగ్ బాస్‌ వంటి షో ను ఇండియాలో బ్యాన్ చేయాల్సిందే అన్నట్లుగా కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇంతకు భాను శ్రీ బిగ్ బాస్ గురించి ఏమన్నదంటే... బిగ్ బాస్ షో ని ప్రేక్షకులు ఎలా చూస్తున్నారో అర్థం కావడం లేదు. ఆ షో ఎందుకు అంత విజయం సాధిస్తుందో నాకు ఇప్పటికి ఆశ్చర్యంగానే ఉంటుంది. అంతే కాకుండా ప్రతి సీజన్ కి కూడా ప్రేక్షకులు పెద్ద ఎత్తున రేటింగ్ ఇవ్వడం కూడా విడ్డూరంగా అనిపిస్తుంది. నా దృష్టి లో బిగ్ బాస్ షో అనేది ఒక చెత్త షో అంటూ ఆమె ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం భాను శ్రీ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.