Begin typing your search above and press return to search.

'భామాకలాపం 2' - ఆహా.. మరో థ్రిల్ రైడ్ రెడీ

'ఆహా'లో వచ్చిన 'భామాకలాపం' ప్రేక్షకులకు మంచి రెస్పాన్ అందుకున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Feb 2024 5:50 AM GMT
భామాకలాపం 2 - ఆహా.. మరో థ్రిల్ రైడ్ రెడీ
X

'ఆహా'లో వచ్చిన 'భామాకలాపం' ప్రేక్షకులకు మంచి రెస్పాన్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రియమణి ఆ సినిమాలో అద్భుతంగా నటించి ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఆమె నటించిన 'భామాకలాపం' సీక్వెల్ పై గతకొంత కాలంగా వరుస అప్డేట్స్ తో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆహా OTT ఫ్లాట్ ఫామ్ లోనే విడుదల కాబోతున్న ఈ సీక్వెల్ కాన్సెప్ట్ కు సంబంధించిన టీజర్ ట్రైలర్ లను కూడా ఇదివరకే రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ల నుండి టీజర్ వరకు, ప్రచార కంటెంట్ బాగా ఆకట్టుకునేలా టీమ్ చూసుకుంది. ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదల కాగా మంచి బజ్ క్రియేట్ చేసింది. టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రియమణి మరోసారి అంతే ఎనర్జిటిక్ తో హైలెట్ అయ్యింది. ఆమె కారు ఛేజింగ్‌ సీన్స్, మృతదేహాలను దాచడం, యాక్షన్ డోస్ తో స్టన్ అయ్యేలా చేయడంలో ప్రియమణి మంచి హైప్ క్రియేత్ చేశారు.

ఒక యూట్యూబ్ ఛానెల్ జీవితం నుంచి కుకింగ్ కాంపిటీషన్ వరకు వెళ్లే మహిళ మధ్యలో అనుకోని కారణాల వలన దోపిడీకి స్కెచ్ వేసే అంశాలు కూడా సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ప్రేక్షకులు ఈ సీక్వెల్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పవచ్చు. మంచి హైప్ మరియు అంచనాల మధ్య ఫిబ్రవరి 16న ఆహాలో విడుదలవుతోంది.

ఆహా స్టూడియోస్‌తో కలిసి డ్రీమ్‌ ఫార్మర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించారు, సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలలో కనిపించారు. మంచి ఫ్యామిలీ డ్రామాతో పాటు థ్రిల్లింగ్ అనిపించే యాక్షన్ డోస్ కూడా సినిమాలో ఉన్నట్లు అనిపిస్తుంది.

అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాపినీడు & సుధీర్ ఈదర నిర్మించారు. మొత్తానికి ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూర్చగా, దీపక్ యరగెర ఫోటోగ్రఫీ అందించారు. 'భామాకలాపం 2' ఫిబ్రవరి 16 నుండి ఆహాలో ప్రసారం కానుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుంటుందో చూడాలి.