Begin typing your search above and press return to search.

భామాకలాపం 2 టీజర్: న‌వ్విస్తూనే ద‌డ పుట్టించారు!

శరణ్య తన భాగస్వామితో కలిసి థ్రిల్లింగ్ హీస్ట్ అడ్వెంచర్‌ను ప్రారంభించ‌గా, అనుపమ అనే అమాయకపు గృహిణిగా ప్రియమణి తన పాత్రను తిరిగి పోషించింది.

By:  Tupaki Desk   |   31 Jan 2024 5:05 AM GMT
భామాకలాపం 2 టీజర్: న‌వ్విస్తూనే ద‌డ పుట్టించారు!
X

భార్య మంచిగా మార‌డం కోసం అపార్ట్ మెంట్ మారాల‌నుకునే అమాయ‌క భ‌ర్త‌... అమాయ‌కంగా క‌నిపిస్తూనే దారుణ హ‌త్య‌లు చేసే భామ వ్య‌వ‌హారం చూస్తుంటూ ఇది `హీస్ట్ ఫీస్ట్` అన‌కుండా ఉండ‌లేం! ఇటీవ‌ల‌ విడుద‌లైన `భామాకలాపం 2` ఎ డెలీషియస్ హీస్ట్ ఫీస్ట్ ఫస్ట్ లుక్ ఆక‌ట్టుకోగా, టీజ‌ర్ ఇప్పుడు మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. హాయిగా న‌వ్వుకుంటూనే థ్రిల్స్ ని ఎంజాయ్ చేసేందుకు స్కోప్ ఉంది ఇందులో. ఆహా లో టీజర్ దూసుకుపోతోంది. శరణ్య తన భాగస్వామితో కలిసి థ్రిల్లింగ్ హీస్ట్ అడ్వెంచర్‌ను ప్రారంభించ‌గా, అనుపమ అనే అమాయకపు గృహిణిగా ప్రియమణి తన పాత్రను తిరిగి పోషించింది. భామా క‌లాపం భారీ వ్యూస్ తో గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకోగా, ఇప్పుడు పార్ట్ 2 పైనా పెద్ద‌ అంచనాలేర్ప‌డ్డాయి.

టీజర్ ఆరంభంలోనే అపార్ట్ మెంట్ మార‌డానికి కార‌ణ‌మేమిటో అమాయ‌క‌పు గృహిణి అనుప‌మకు చెబుతుంటాడు భ‌ర్త‌. అవును మంచిగా మారుతున్నాను అంటూనే అనుప‌మ చేసే అరాచ‌కం మామూలుగా లేదు. అపార్ట్ మెంట్ క‌ల్చ‌ర్ లో అదిరిపోయే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ఈ సిరీస్ అని అర్థ‌మ‌వుతోంది. ఇందులో అనుక్ష‌ణం థ్రిల్స్ కి కొద‌వేమీ లేద‌ని టీజ‌ర్ చెబుతోంది. భ‌ర్త‌కు మాటిచ్చిన త‌ర్వాత అనుప‌మ‌ దారుణంగా హత్య చేస్తున్న సీన్ .. భారీ భ‌వంతిలో అతిపెద్ద దోపిడీతో ముడిపడి ఉన్న భారీ గందరగోళంలో త‌న‌కు తెలియ‌కుండానే చిక్కుకునే అనుప‌మ క‌థేమిట‌న్న‌ది విచిత్రంగానే ఉంది. ఈ థ్రిల్లింగ్ హీస్ట్ అడ్వెంచర్‌లో ప్రియమణి , శరణ్య ప్రదీప్ టైమింగ్ నవ్వులు పూయిస్తుంది. ఫిబ్రవరి 16న `భామాకలాపం 2` ప్రీమియర్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ త‌దిత‌రులు ఇందులో న‌టించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించగా, వెబ్ ఒరిజినల్‌కి దీపక్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. విప్లవ్ ఎడిటింగ్ వ‌ర్క్ చేసారు.

ఈ చిత్రాన్ని ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు- సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ నిర్మిస్తున్నారు.