Begin typing your search above and press return to search.

పొలిమేర 2 బాటలో మరో సినిమా..!

పొలిమేర 2 చూపించిన బాటలోనే ఇప్పుడు మరో సినిమా వస్తుంది. అదే భామాకలాపం. ఆహా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది

By:  Tupaki Desk   |   23 Nov 2023 12:30 PM GMT
పొలిమేర 2 బాటలో మరో సినిమా..!
X

ఓటీటీ రిలీజ్ కోసం రెడీ చేసి థియేట్రికల్ రిలీజ్ చేసిన సినిమాలు చూశాం. కానీ కొన్ని సినిమాలు ఓటీటీలో డైరెక్ట్ రిలీజై ఆ తర్వాత వాటి కొనసాగింపు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల వచ్చిన మా ఊరి పొలిమేర 2 సినిమా దీనికి మంచి ఉదాహరణ. పొలిమేర 1 డైరెక్ట్ ఓటీటీ రిలీజై సూపర్ హిట్ కాగా పొలిమేర 2 ని థియేట్రికల్ రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు మేకర్స్. దగ్గర దగ్గర పెట్టిన బడ్జెట్ కు 3 రెట్లు రిటర్న్స్ వచ్చాయని తెలుస్తుంది.

పొలిమేర 2 చూపించిన బాటలోనే ఇప్పుడు మరో సినిమా వస్తుంది. అదే భామాకలాపం. ఆహా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. వంటల వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టే గృహిణి ఒక క్రైమ్ లో ఇరుక్కోవడం నేపథ్యంలో భామా కలాపం సినిమా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాను అభిమన్యు బాగా తీశారు.

భామాకలాపం 2 సినిమాను థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఓటీటీ లో మొదటి పార్ట్ రిలీజై పార్ట్ 2 ని థియేట్రికల్ రిలీజ్ చేయడం మంచి విషయమే అని చెప్పొచ్చు. ఇక్కడ మరోసారి ఆడియన్స్ కంటెంట్ ఉన్న సినిమాలను ఏమేరకు ఎంకరేజ్ చేస్తారన్నది తెలుస్తుంది. భామాకలాపం సినిమాలో ప్రియమణి నటించారు. భామాకలాపం 2 పోస్టర్ లో ప్రియమణి వెనక గన్నులు, వాక్యూమ్ క్లీనర్ తో కనిపించింది.

మరి ఈ సినిమా కొనసాగింపు ఎలా ఉండబోతుందో చూడాలి. లీడ్ రోల్స్ రాకపోయినా సరే వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ వస్తున్న ప్రియమణికి భామాకలాపం 2 తో మరోసారి సోలోగా ఆడియన్స్ ని అలరించే అవకాశం వచ్చింది. తప్పకుండా ఈ సినిమాతో ప్రియమణికి కొత్త జోష్ వస్తుందని చెప్పొచ్చు. కోట్ల బడ్జెట్టు, స్టార్ కాస్ట్ ఇవేవి ఒక సినిమా హిట్ కి కారణాలు అవ్వవని.. సరైన కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారని చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మేకర్స్ అంతా కూడా ఓటీటీ ఆడియన్స్ మనసులు గెలిచిన సినిమాల సీరీస్ లతో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్నారు. ఇదో కొత్త పంథా తెలుగులో కొనసాగుతుంది.