Begin typing your search above and press return to search.

ఆస‌క్తి పెంచుతున్న బ‌కాసుర రెస్టారెంట్

టాలీవుడ్ ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ప్ర‌వీణ్ త్వ‌ర‌లోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బ‌కాసుర రెస్టారెంట్ పేరుతో ఓ హంగ‌ర్ కామెడీ మూవీ చేస్తున్నాడు ప్ర‌వీణ్‌.

By:  Tupaki Desk   |   2 May 2025 1:56 PM IST
ఆస‌క్తి పెంచుతున్న బ‌కాసుర రెస్టారెంట్
X

టాలీవుడ్ ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ప్ర‌వీణ్ త్వ‌ర‌లోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బ‌కాసుర రెస్టారెంట్ పేరుతో ఓ హంగ‌ర్ కామెడీ మూవీ చేస్తున్నాడు ప్ర‌వీణ్‌. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను మేక‌ర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వైవా హ‌ర్ష టైటిల్ రోల్ పోషిస్తుండ‌గా, షైనింగ్ ఫ‌ణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కొన్నాళ్ల ముందట ప్ర‌వీణ్ త‌ర్వ‌లోనే బ‌కాసుర అనే పేరుతో రెస్టారెంట్ ను స్టార్ట్ చేయ‌నున్నాడ‌ని వార్త‌లొచ్చిన విష‌యం తెలిసిందే.

ఆల్రెడీ యాక్ట‌ర్ గా బిజీగా ఉన్న ప్ర‌వీణ్ కు రెస్టారెంట్ ను స్టార్ట్ చేసి, దాని బాధ్య‌త‌లు తీసుకునేంత టైముందా అని అంద‌రూ అనుకుంటున్న టైమ్ లో ఆ విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసింది. అయితే ప్ర‌వీణ్ రెస్టారెంట్ స్టార్ట్ చేయ‌డం లేదు. బ‌కాసుర రెస్టారెంట్ అనే పేరుతో సినిమాను చేస్తున్నాడు. అందులో ప్ర‌వీణ్ హీరోగా న‌టిస్తున్నాడనేది అస‌లు మ్యాట‌ర్.

తాజాగా మేక‌ర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్ట‌ర్ లో ప్ర‌వీణ్ వంట చేస్తూ పెద్ద గెరిట‌తో క‌నిపించ‌గా, ప‌క్క‌న విచిత్ర ఆకారాల్లో వైవా హ‌ర్ష‌, షైనింగ్ ఫ‌ణి క‌నిపించి పోస్ట‌ర్ ను మ‌రింత ఇంట్రెస్టింగ్ గా మార్చారు. అదే పోస్ట‌ర్ లో పాడుబడిన పాత బంగళా, మోడుబోయిన చెట్టు చూస్తుంటే సినిమాలో హ‌ర్ర‌ర్ ఎలిమెంట్స్ కూడా ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతుంది.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేయ‌గా, ఆ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. బ‌కాసుర రెస్టారెంట్ సినిమాతో ప్ర‌వీణ్ లోని కొత్త యాంగిల్ ను అంద‌రూ చూస్తార‌ని అంద‌రూ చెప్పుకుంటున్నారు.

హంగ‌ర్ కామెడీ అనే కొత్త కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా అన్ని వ‌ర్గాల ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్ర యూనిట్ చెప్తోంది. బ‌కాసుర రెస్టారెంట్ అనే సినిమాతో ఎస్‌జె శివ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానుండ‌గా, ఈ సినిమాను ఎస్‌జె మూవీస్ బ్యాన‌ర్ లో ల‌క్ష్మ‌య్య ఆచారి, జ‌నార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు.