బెల్లంకొండ బలం చూపించబోతున్న భైరవం..!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్ లో విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా భైరవం.
By: Tupaki Desk | 20 May 2025 7:17 PM ISTబెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్ లో విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా భైరవం. సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి సపోర్ట్ గా నారా రోహిత్, మంచు మనోజ్ లు నటించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న భైరవం సినిమాతో మరోసారి తన మాస్ స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. భైరవం ట్రైలర్ చూస్తే బెల్లంకొండ శ్రీనివాస్ ఇంటెన్స్ యాక్షన్ ఎలా ఉండబోతుందో తెలుస్తుంది.
ఆల్రెడీ తను ఇదివరకు చేసిన సినిమాల వల్ల బెల్లంకొండ హీరోకి యాక్షన్ ఇమేజ్ రాగా అందుకు ఏమాత్రం తగ్గకుండా భైరవం సినిమాలో అతని క్యారెక్టరైజేషన్ పడిందని తెలుస్తుంది. భైరవం సినిమా మొన్నటిదాకా ఒక లెక్కగా ఉండగా ట్రైలర్ రిలీజ్ అయ్యాక మరింత బజ్ ఏర్పరచుకుంది. ట్రైలర్ లో బెల్లంకొండ మాస్ విధ్వంసం నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంది.
భైరవం సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర గురించి అతని యాక్షన్ గురించి డైరెక్టర్ విజయ్ కనకమేడల కూడా ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్ లో ప్రత్యేకంగా చెప్పారు. ఈ సినిమా కోసం అతను చూపించిన డెడికేషన్ గురించి చెప్పారు. అంతేకాదు జయ జానకి నాయక, రాక్షసుడు సినిమాలు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో భైరవం సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ రోల్ అలా ఉంటుందని అన్నారు.
మొత్తానికి యువ హీరోగా మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం సినిమాతో మంచి అటెంప్ట్ చేశాడు. ఐతే భైరవం ప్రచార చిత్రాలన్నీ కూడా మాసీగా ఆడియన్స్ ని మెప్పించేలా ఉన్నాయి. మరి సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ యాక్షన్ స్టంట్స్ హైలెట్ గా ఉంటూ మరో ఇద్దరు హీరోలైన మనోజ్, నారా రోహిత్ ఫ్యాన్స్ ని కూడా సాటిస్ఫై చేసేలా ఈ భైరవం రాబోతుంది. మరి వెండితెర మీద మాస్ బొమ్మగా ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న ఈ సినిమా ఏమేరకు ఆ అంచనాలను అందుకుంటుంది అన్నది రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.
