Begin typing your search above and press return to search.

ఒక సినిమా ముగ్గురు హీరోల కెరీర్..?

ఒక సినిమా సక్సెస్ హీరోల కెరీర్ ని డిసైడ్ చేస్తుంది. అలాంటిది ఒక సినిమా మీద ముగ్గురు హీరోల కెరీర్ డిపెండ్ అవ్వడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.

By:  Tupaki Desk   |   10 May 2025 9:26 PM IST
ఒక సినిమా ముగ్గురు హీరోల కెరీర్..?
X

ఒక సినిమా సక్సెస్ హీరోల కెరీర్ ని డిసైడ్ చేస్తుంది. అలాంటిది ఒక సినిమా మీద ముగ్గురు హీరోల కెరీర్ డిపెండ్ అవ్వడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇంతకీ ఏంటా సినిమా ఎవరా ముగ్గురు హీరోలు అని తెలుసుకోవాలంటే ఇంకాస్త డీటైల్స్ లోకి వెళ్లాల్సిందే. ఎన్ని ఓటీటీలు వచ్చినా.. ఎంత పాన్ ఇండియా రిలీజ్ లు అవుతున్నా కొన్ని కథలు మాత్రం రీమేక్ కు పర్ఫెక్ట్ అని భావించి తెరకెక్కిస్తూనే ఉన్నారు. అలాంటి సినిమానే ఈ నెల చివరన రాబోతుంది.

తమిళ్ లో సక్సెస్ అయిన గరుడన్ సినిమాను తెలుగులో భైరవం అని రీమేక్ చేశారు. ఈ రీమేక్ ని విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ముగ్గురు ఈ సినిమాలో నటించారు. బెల్లంకొండ శ్రీనివాస్ లీడ్ రోల్ కాగా మిగతా ఇద్దరు ఈక్వల్ రోల్స్ పోషించారు. ఐతే ఈ సినిమా మీద ఈ ముగ్గురు హీరోలు చాలా హోప్స్ పెట్టుకున్నారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగా అనిపిస్తుంది.

నారా రోహిత్ వరుస ఫ్లాపుల వల్ల కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఐతే భైరవం సినిమాలో తన పాత్రతో మరోసారి ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. మంచు హీరో మనోజ్ కూడా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మనోజ్ కి ప్లస్ అయితే ఆత్రం రాబోయే సినిమాలకు హెల్ప్ అవుతుంది.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కూడా కొద్దిపాటి గ్యాప్ తర్వాత భైరవంతో వస్తున్నాడు. ఈ సినిమాతో అతను కూడా కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఇలా అసలేమాత్రం ఫాంలో లేని ముగ్గురు మాస్ హీరోలతో భైరవం సినిమా తీసి ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నారు. ఐతే ఎలాగు మాస్ ఆడియన్స్ కి ఎలాంటి సినిమా అయినా వాళ్లకి నచ్చే మూమెంట్స్ ఉంటే ఎక్కేస్తుంది. మరి భైరవం సినిమా ఆ రేంజ్ లో మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుందా లేదా అన్నది చూడాలి. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కె.కె రాధామోహన్ ఈ సినిమా నిర్మించారు. భైరవం సినిమాలో స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటించింది. మే 30న ఆల్రెడీ విజయ్ దేవరకొండ కింగ్ డం వస్తుంది. మరి రౌడీ హీరోకి పోటీగా ఈ భైరవం హీరోలు ఏ రేంజ్ ఫైట్ అందిస్తారన్నది చూడాలి.